video parlours business fruitfull after porn sites ban

Good days to video parlours

good days to video parlours, video parlours business fruitfull after porn sites ban, video parlours, business, porn sites, ban on porn sites, supreme court, video parlours, business, fruitfull, porn sites ban, supreme court

good days to video parlours as central government banned porn sites as per orders passed by supreme court

వీడియో పార్లర్ లకు మంచి రోజులు.. మళ్లీ చిగురించిన వ్యాపారాలు

Posted: 08/09/2015 04:31 PM IST
Good days to video parlours

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశానుసారం పోర్న్ వెబ్ సైట్లపై నిషేధం విధించడంతో అనేక మంది నెట్ జనులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న తరుణంలో.. తమకు మళ్లీ పూర్వ వైభవం తిరిగి వస్తుందని కొంత మంది మాత్రం పండగ చేసుకుంటున్నారు. వారెవరో కాదు.. వీడియో పార్లర్, వీసిడి, డీవీడీ షాప్ యజమానులు. సాంకేతిక విప్లవంతో అందుబాటులోకి వచ్చిన అంతర్జాలం ప్రపంచాన్ని తమ గుప్పిట్లోకి తీసుకురావడంతో పాటు అశ్లీల వెబ్ సైట్లు కూడా నెట్ జనులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో కొన్నేళ్ల పాటు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన తమ వ్యాపారాన్ని ఇంటర్ నెట్ డీలా పర్చింది.

దీంతో అనేక మంది వీడియో పార్లర్ లను తీసివేసి ఇతర వ్యాపారాల్లోకి వలసవెళ్లి స్థిరపడ్డారు. అయితే కోందరు మాత్రం ముక్కిమూలుగుతూ తమ వ్యాపారాలను చచ్చి చెడి నడుపుకుంటున్నారు. కేవలం కొత్త సినిమా సీడీలు, డీవిడీలపైనే ఆధారపడి వచ్చినదేదో చాలునని సరిపెట్టుకున్నారు. అయితే అత్యున్నత న్యాయస్థానం అదేశంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా దాదాపు 800 పోర్న్ వెబ్ సైట్లను నిషేధించడంతో వీరికి మళ్లీ గిరాకీ పెరిగుతుందని, ఇదే పరిస్థితి కోనసాగితే.. తాము వ్యాపారాలు గతంలో మాదిరిగానే నడుస్తాయని అభిప్రాయపడ్డారు.
 
నీలు చిత్రాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో లేకపోవడంతో న్యూఢిల్లీలో చాలా మంది పాలిక బజార్, లజపత్ నగర్, పహర్గాని వంటి డీవీడీ హోల్‌సేల్ మార్కెట్లకు రావడం మొదలెట్టారట. దీంతో డీవీడీ పార్లర్ యజమానులు వీటి ధరలను అమాంతం పెంచేశారు. వారం క్రితం రూ.100కి అమ్మిన డీవీడీని ఇప్పుడు రూ.300కి అమ్ముతున్నా కొనుగోలు దారులు వెనకడుగు వేయడం లేదట. అయితే వీటిపై పోర్న్‌ను సూచించే ఎలాంటి కవర్లూ ఉండవు. కాబట్టి వీటిని అరికట్టడం చాలా కష్టం. మరి వీటి విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : video parlours  business  fruitfull  porn sites ban  supreme court  

Other Articles