It is fun doing this': All you need to know about militant Naved aka Usman, who was captured in Udhampur

It is fun doing these attacks says pakistani terrorist qasim khan

Border Security Force (BSF), India-Pakistan, Jammu and Kashmir, Kasim Khan, LeT terrorist Qasim Khan, Momin Khan, LeT terrorist Kasim Khan, 3 locals into hostage, J&K terror attack, BSF convoy attacked, Border Security Force Convoy attacked, Jammu and Srinagar Highway, Udhampur, JandK police, JK police, Home Ministry, Rajnath Singh, BSF Convoy, India, Pakistan, Udhampur Terror Attack

Its fun doing this," Naved, the suspected Lashkar-e-Taiba militant from Pakistan who was caught alive after the attack on the BSF convoy that killed two constables, revealed casually to cameras.

అమర్నాథ్ యాత్ర,, భారత సైన్యమే టార్గెట్..

Posted: 08/05/2015 11:32 PM IST
It is fun doing these attacks says pakistani terrorist qasim khan

ఉగ్రవాద దాడులు చేయడం భలే సరదాగా ఉంటుందని జమ్ము కశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ చెప్పాడు. తమ లక్ష్యం అమర్నాథ్ యాత్ర, సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యమేనని అన్నాడు. తాను పాకిస్థాన్ నుంచే వచ్చినట్లు వెల్లడించాడు. బీఎస్ఎఫ్ దళాలపై దాడి చేసి ఇద్దరు బీఎస్ఎఫ్ కానిస్టేబుళ్లను హతమార్చిన తర్వాత ఒక ఉగ్రవాది హతం కాగా, నావెద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అలియాస్ ఖాసిం ఖాన్ మాత్రం సజీవంగా పట్టుబడిన విషయం తెలిసిందే. అతడి వయసు 20 ఏళ్లని అధికారులు గుర్తించారు. అలాగే మరణించిన ఉగ్రవాది పేరు నోమన్ అలియాస్ మొమిన్ ఖాన్ అని గుర్తించారు.  హిందువులను చంపడానికే తాను వచ్చానని స్పష్టం చేశాడు.

తనది పాకిస్థాన్లోని ఫైసలాబాద్ అని, 12 రోజుల క్రితం మొమిన్ ఖాన్ అనే సహచర ఉగ్రవాదితో కలిసి వచ్చానన్నాడు. మొమిన్ ఖాన్ది పాకిస్థాన్లోని భాగల్పూర్ ప్రాంతం. డార్క్ బ్లూ కలర్ షర్టు, బ్రౌన్ రంగు ప్యాంటు వేసుకొచ్చిన నావెద్.. చాలా ఉల్లాసంగా కనిపించాడు. తాను కూడా సైన్యం చేతిలో చనిపోయి ఉంటే.. అది అల్లా దయేనని అనుకునేవాడినని, ఇదంతా చేయడం చాలా సరదాగా ఉంటుందని చెప్పాడు. మొదట తన వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమేనని చెప్పిన అతడు, తర్వాత విచారణలో అసలు వయసు వెల్లడించాడు. సాధారణంగా లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఎప్పుడు పట్టుబడినా.. తమ వయసు 18 ఏళ్ల లోపేనని చెప్పాలని, అలా అయితే బాల నేరస్థులుగా పరిగణిస్తారని వాళ్లకు శిక్షణలో చెబుతారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Force (BSF)  India-Pakistan  Jammu and Kashmir  Kasim Khan  

Other Articles