Colombian model faces death penalty after being charged with smuggling drugs in China

Drug smuggling model faces death penalty in china

juliana lopez, colombian model, death penalty, life imprisonment, Drugs, Crime, psychoactive drugs, computer, Guangzhou airport, smuggling drugs, Colombian model faces death penalty,

Juliana Lopez, 22, was allegedly found with psychoactive drugs in her computer after she was stopped at Guangzhou airport

ITEMVIDEOS: మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మోడల్ కు ఉరిశిక్ష..!

Posted: 08/05/2015 11:36 PM IST
Drug smuggling model faces death penalty in china

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తూ దొరికిపోయిన కొలంబియన్ మోడల్ జులియానా లోపేజ్కు మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మత్తు పదార్థాలను కంప్యూటర్లో పెట్టి అక్రమంగా రవాణా చేస్తూ  గాంగ్జౌ ప్రావిన్స్లోని గాంగ్జౌ ఎయిర్పోర్ట్లో జులై 18వ తేదీన కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అయితే లోపేజ్ ప్రస్తుతానికి ఎక్కడ ఉందో తెలిదని చైనా రేడియో ఇంటర్నేషనల్ బుధవారం వెల్లడించింది. ఓ వేళ బీజింగ్లోని కొలంబియన్ రాయబార కార్యాలయంలో ఉండవచ్చని అభిప్రాయ పడ్డింది. కాగా న్యాయస్థానంలో లోపేజ్ తరపున కేసు వాదించేందుకు న్యాయవాది కోసం ఆమె కుటుంబ సభ్యులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది.



అయితే లోపేజ్ అమాయకురాలని ఆమె స్నేహితురాలు లిస్ హెర్నాండజ్ తెలిపింది. లోపేజ్ నేరస్తురాలు కాదని తన మనసు చెబుతుందని చెప్పింది. చైనాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను స్థానిక ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. అందులోభాగంగా అక్రమ రవాణాను అరికట్టేందుకు స్మగ్లర్లపై కఠిన శిక్షలు విధించి అమలు చేస్తోంది. పెరుగ్వే దేశానికి చెందిన 31 యువతి మత్తు పదార్ధలను అక్రమ రవాణా చేస్తు 2012లో పట్టుబడింది. దాంతో ఆమె నాటి నుంచి చైనా జైలులోనే ఉంది. ఆమెకు మరణశిక్ష విధించే అవకాశాలు అధికంగా ఉన్నాయని మీడియా ఈ సందర్భంగా తెలిపింది. దీంతో జులియానా లోపేజ్కు కూడా ఉరిశిక్ష లేదా. యావజ్జీవ శిక్ష విధించే అవకాశాలున్నాయని వార్తుల వినబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : juliana lopez  colombian model  death penalty  life imprisonment  Drugs  Crime  

Other Articles