Ready to fight along with Pawan for special status- JC

Mp jc invites pawan kalyan to fight for ap special status

jc diwakar reddy, Pawan Kalyan, Pawan Kalyan victim of TDP's 'use and throw' policy, Pawan Kalyan Victim, Chandrababu, YSRCP, special status, TDP mps, BJP, NDA government, Narendra Modi

TDP MP JC Diwakar reddy invites janasena president, power star pawan kalyan to fight for Andhra pradesh special status

ఫ్రత్యేక హోదా కోసం పవన్ పోరాడితే మద్దుతునిస్తాం..

Posted: 08/01/2015 07:37 PM IST
Mp jc invites pawan kalyan to fight for ap special status

కాంగ్రెస్ కు చెందిన మాజీ నేత, ప్రస్తుత టీడీపీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో వున్న అంతర్గత ప్రజాస్వామ్యం టీడీపీలో వుందనికుంటున్నారో. ఏమో తెలియదుకానీ, ఆయన టీడీపీ అధినేతను ఇబ్బందులు పెట్టే వ్యాఖ్యలు చేశారు. తమ మిత్రపక్షంగా కేంద్రంలో కోలువుదీరిన నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా రాదని చంద్రబాబు తెలుసనిని జేసి చేసిన వ్యాఖ్యలు టీడీపీ సహా ఆంధ్రప్రదేశ్ లోని మేధావివర్గంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విషయం ముందే తెలిసిన తమ ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులుగా..  ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తున్నారని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అందరూ అడుగుతున్నారు, కానీ బీజేపీ దున్నపోతుపై వర్షం పడ్డట్టు వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఇంగితజ్ఞానం నేటి పాలకులకు లేదు అని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై పవన్‌ పోరాడాలి అందుకు తాము మద్దతిస్తామని ఆయన అన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా రాదు, అది పార్లమెంటు సాక్షిగా కేంద్రమంత్రి ఇంద్రజీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లమైందని జేసీ వ్యాఖ్యానించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jc diwakar reddy  AP TDP MPs  BJP  NDA government  

Other Articles