Surfer punches shark to escape attack

Surfer fights off shark in australia attack

Surfer fights off shark in Australia attack, Surfer punches shark to escape attack, Shark attack victim in a "serious but stable" condition, Ex-boxer, Ex-boxer punches way past attacking shark, new south wales, australia surfer, australia news, punches to shark, craig ison, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, Sdney, news, entertainment news

An Australian surfer punched a shark that attacked him on Friday. He was later hospitalised as the giant fish bit his hand, arms and leg.

సొరచేపకు పంచుల పవర్ రుచిచూపిన సర్పర్..

Posted: 07/31/2015 09:12 PM IST
Surfer fights off shark in australia attack

ఆ ఆస్ట్రేలియన్ సర్పర్ కి ఇంకా భూమ్మిద నూకలు బాకీ వున్నాయి. అతనిపై శివుడి అజ్ఞ లేకపోవడం అందుకే అతను చావు చేంతకు వెళ్లినా.. తనకు తెలిసిన విద్యతో తప్పించుకుని రాగలిగాడు. అదెలా అంటారా..? తన చేతి పంచుల ద్వారా..?  నమ్మశక్యంగా లేదా..? షార్క్ లాంటి అతిపెద్ద జంతువు మనిషి పంఛ్ పవర్ తో వెనుదిరింగిందంటే నమ్మశక్యంగా లేదు కదూ..? కానీ ఇదే నిజం. అస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ లో అ అరుదైన ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన క్రెయిగ్ ఐసన్ పరిస్థితి మాత్రం విషమంగానే వున్నా నిలకడగా వుందని వైద్యులు తెలిపారు.

ఇవాళ ఉదయం ఐసన్ సహా మరో వ్యక్తి 100 మీటర్ల సర్పింగ్ చేస్తుండగా.. అనుకోకుండా వారికి ఓ షార్ప్ కనిపించింది. అంతే వారు దాని చూసిన షాక్ నుంచి తేరుకోకముందే అది వారిపై దాడికి యత్నించింది. ఈ క్రమంలో ఐసన్ తో వచ్చిన వ్యక్తి తప్పించుకోగా, ఐసన్ మాత్రం దానికి చిక్కాడు. అయితే తాను చేస్తున్న సర్పింగ్ క్రీడ కన్నా ముందు తాను బాక్సింగ్ లో నిష్ణాతుడు. సరిగ్గా అ క్రీడను గుర్తు తెచ్చుకున్న ఐసన్.. షార్క్ నుంచి తప్పించుకునే క్రమంలో దానిపై పంచుల వర్షం కురిపించాడు. అప్పటికీ షార్క్ తన తోకతో ఐసన్ శతవిధాలా గాయపర్చేందుకు యత్నించింది. దానిపైనా కూడా ఐసన్ తన పిడిగుద్దులు కరిపించి.. ఎలాగోలా తప్పించుకోగా సముద్ర తీరంలో వున్నవారు అయన పరిస్థితిని గమనించి వెంటనే అసుపత్రికి తరలించేందారు.

ఈ ప్రయత్నంలో ఐసన్ చేతికి, కాలికీ గాయాలలయ్యాయని అధికారులు వివరించారు. సర్జరీ చేయాల్సి అవసరం వుందని వైద్యులు తెలిపారు. ఈ నెలలో ష్కార్ దాడి జరగడం ఇది మూడోవసారి అని, ఈ ఘటన తర్వాత 24 గంటల పాటు చుట్టుపక్కల వున్న అన్ని బీచ్ లను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అస్ట్రేలియా సర్పింగ్ ఛాంపియన్ మిక్ పాన్నింగ్ దక్షిణాప్రికాలోని ఓ బీచ్ లో తనపై దాడికి యత్నించిన షార్క్ పై పంచుల పవన్ చూపించిన వారంలోనే అస్ట్రేలియా మరో సర్పర్ షార్క్ బారిన పడి అదే పద్దతిలో భయటపడటం గమనార్హం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : australia surfer  punches to shark  craig ison  

Other Articles