Public Tribute to Former President APJ Abdul Kalam At His Residence in Delhi

Pm modi rahul gandhi and chandrababu pay tribute to abdul kalam

PM modi and chandrababu pay tribute to abdul kalam, APJ Abdul Kalam, Abdul Kalam, Abdul Kalam Shillong, Abdul Kalam ICU, Abdul Kalam hospital, Abdul Kalam Dies, PM Modi tributes to modi, Ap cm chandrababu tributes to kalam, Abdul Kalam dies,former president dies, Rahul gandhi pays tribute to abdul kalam

Prime Minister Narendra modi, leader of the opposition Rahul gandhi and Andhra pradesh chief minister chandrababu pay tribute to Dr APJ Abdul Kalam

ITEMVIDEOS: అగ్ని సాధకుడికి నివాళులు పలికిన ప్రధాని, రాహుల్, చంద్రబాబు

Posted: 07/28/2015 01:01 PM IST
Pm modi rahul gandhi and chandrababu pay tribute to abdul kalam

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం గొప్ప మార్గదర్శకుడు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కలాం మృతి పట్ల మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కలాం గొప్ప మేధావి అని....ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. రాష్ట్రపతి భవన్‌కు ప్రజలను చేరువ చేసేందుకు కలాం ఎంతో కృషి చేశారని కొనియాడారు. భారత దేశం శాస్త్రసాంకేతిక రంగాల్లో ముందుకు దూసుకుపోతూ, ప్రపంచ దేశాలకు పోటీనివ్వడంతో కలాం కృషి ఎంతో వుందన్నారు. కలాం చివరిక్షణం వరకు విద్యార్థులతోనే గడిపారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలం మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలాం మరణం తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని చెప్పారు. ఆయన రాష్ట్రపతి పదవిని చేపట్టి.. దేశ ప్రజల హృదయాలను చూరగోన్నారని రాహుల్ అన్నారు. తన యుక్త అలోచనలతో యువతను నిరంతరం కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునేందుకు శ్రమించండీ అంటూ పిలుపునిచ్చిన కలాం తన వివేకంతో భారత జాతీ యువత మనస్సును గెలుచుకున్నారని పేర్కోన్నారు. కలాం విజన్‌ను, ఆయన ఆలోచనలను కోల్పోయామని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.

చివరి క్షణం వరకు దేశం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి అబ్దుల్‌ కలాం అని రాహుల్ అన్నారు. యువతలో ఆలోచనలను తట్టిలేపిన గొప్ప వ్యక్తి కలాం అని చెప్పారు. రాష్ట్రపతిగా దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివని అన్నారు. దేశం మొత్తం ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన చెప్పారు. దేశం ఫోక్రాన్ పరీక్షలో అబ్దుల్ కలాం పాత్ర కీలకమని రాహుల్ చెప్పుకోచ్చారు. యువత కలాం ఆశయాలను సాధించడానికి నిత్యం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

భరతమాత ముద్దు బిడ్డ, దేశానికే గర్వకారణంగా జీవించిన వ్యక్తి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం మరణం దిగ్ర్భాంతికి గురిచేసిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దేశం గొప్పశాస్త్రవేత్తను, మేధావిని....శాస్త్రసాంకేతిక రంగం పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. తనతో ఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. కలాం జీవితం ప్రజలందరికీ ఓ ఆదర్శమని తెలిపారు. భారతదేశ కీర్తి ప్రతిష్టతలను ప్రపంచం మొత్తం చాటి చెప్పిన వ్యక్తి అబ్దుల్‌ కలాం అని కొనియాడారు.
 
నిరంతర కృషి, పట్టుదలతో పనిచేయడమే కలాంను ఉన్నతశిఖరాల్లోకి చేర్చిందన్నారు. ఇస్రోలో పనిచేయడం పెద్ద విజయమని కలాం ఎప్పుడూ చెబుతుండే వారని గుర్తుచేశారు. కలాంను భారత రాష్ట్రపతిగా చేయడంలో తాను కూడా భాగాస్వామి అవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అలిపిరిలో తనపై దాడి జరిగిన సమయంలో ప్రోటోకాల్‌ను సైతం పక్కనపెట్టి పరామర్శించారని గుర్తుచేసుకున్నారు. కలాం 75వ జన్మదినోత్సవాన్ని విద్యార్థుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమతి ప్రకటించిందన్నారు. అబ్దుల్‌ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తను చనిపోతే సెలవు ఇవ్వొద్దని...అవసరమైతే మరోరోజు అదనంగా పనిచేయాలని చెప్పిన మహోన్నత వ్యక్తి కలాం అని చంద్రబాబు కొనియాడారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APJ Abdul Kalam  Narendra modi  Rahul Gandhi  Chandrababu naidu  

Other Articles