Rishitheshwari | Nagarjuna University | Rishitheshwari mystery, AP, Govt, Chandrababu naidu. Babu Rao

Why those leaders are silence on rishitheshwari incident

Rishitheshwari, Nagarjuna University, Rishitheshwari mystery, AP, Govt, Chandrababu naidu. Babu Rao

Why those leaders are silence on Rishitheshwari incident. Chandrababu Naidu , Jagan, and KCR also wont talk about the Rishitheshwari Incident.

రిషితేశ్వరిపై ఈ ముగ్గురి మౌనమేల...?

Posted: 07/28/2015 12:29 PM IST
Why those leaders are silence on rishitheshwari incident

రిషితేశ్వరి ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సంచలనం సృష్టించింది. తన సీనియర్లు తనను ఎంతో చిత్రవధ చేశారని, ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా కనీసం పట్టించుకోవడంలేదని సూసైడ్ లెటర్ లో పేర్కొంది. అయితే ఓ విద్యార్థిని చనిపొతే.. ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులు కిమ్మనకుండా.. ఎందుకు మౌనంగా ఉన్నారు అన్నది ప్రశ్నార్థకం. ఏ చిన్న ఘటన జరిగినా ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటారు అన్న పేరున్న చంద్రబాబు నాయుడు ఎందుకు అంతగా పట్టించుకోవడం లేదు..? కుల రాజకీయాలు చంద్రబాబును రితికేశ్వరి వ్యవహారంలోదూరంగా ఉంచుతున్నాయా.? ఓ వర్గం వారు చంద్రబాబు నాయుడు మీద వత్తిడి తీసుకువస్తున్నారా..? ఇలాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. అయినా ఇంత దారుణం జరిగినా కానీ చంద్రబాబు లాంటి వ్యక్తి కనీసం యాక్షన్ తీసుకోకపోవడం నిజంగా సిగ్గుచేటు.

cbn-on-rithikeshwari

Also Read: చీకటి చరిత్రకు రిషితేశ్వరి లెటర్ లో ప్రతి అక్షరం సాక్షమే

ఇక చంద్రబాబు నాయుడు వల్ల ఏమీ కాదు.. ఆయనొక దొంగ..అదీ ఇదీ అంటూ అంతెత్తున లేచే వైసీపీ నేత జగన్ అన్నా కనీసం రిషితేశ్వరికి అండగా న్యాయపోరాటం చేస్తున్నారా....? అంటే అదీ లేదాయే. జగన్ చంద్రబాబు నాయుడు మీద విమర్శించడానికి ఉన్న తీరిక... ఓ విద్యార్థిని  ఆత్మహత్య చేసుకొని చనిపోతే కనీసం మాట్లాడే సమయం కూడా లేకపోవడం దురదృష్టం. మరి చంద్రబాబు నాయుడును అడ్డుకుంటున్న అవే కారణాలు.. అవే రాజకీయాలు జగన్ ను కూడా అడ్డుకుంటున్నాయా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అక్కాచెల్లెల్లకు అండగా అన్నయ్యగా ఉంటానని జగన్ చెబుతున్నారు.. మరి రిషితేశ్వరి చెల్లెలి వ్యవహారం మాత్రం తనకు పట్టనట్లు వ్యవహరించడం ఎంత మాత్రం న్యాయం.

jagan-on-Rithekeshwari-deat

Also Read:  మరో రిషితేశ్వరి ఆత్మహత్యను ఆపుదాం

సరే వాళ్లంటే ఏవో రాజకీయ, కుల కారణాల కారణంగా నోరు విప్పడం లేదు అనుకుంటే.... నోటి మాటలతో సంచలనం సృష్టించగల కేసీఆర్ పలుకే బంగారమైంది. రిషితేశ్వరి గురించి మాట్లాడటం తప్పు అన్నట్లు కేసీఆర్ ఉన్నారు.  ఓ తెలంగాణకు చెందిన ఉద్యోగులకు ఏం జరిగినా నేనుంటాను... కాలికి ముళ్లు గుచ్చితే నోటితో తీస్తాను అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టే కేసీఆర్ కు రిషితేశ్వరి గురించి మాట్లాడటానికి మాత్రం నోరు పెగలడం లేదు. మాట్లాడితే.. ఎక్కడ అన్యాయానికి అన్యాయం జరుగుతుందని అనుకుంటున్నారో మరి కేసీఆర్ అసలు రిషితేశ్వరి అంటే ఎన్నటూ వినని పేరు అన్నట్లు ఉంటున్నారు. వరంగల్ బిడ్డ సీమాంధ్రలో ఆత్మహత్య చేసుకుంటే ప్రశ్నించడం మాట అటుంచి.. కనీసం సంతాపం కూడా తెలపలేదు మరి.

kcr-on-rithikeshwari

Also Read:  రిషితేశ్వరి ఆత్మహత్య - ఎన్నో ప్రశ్నలు

ఎందుకు ఇలా...? ఎందుకు ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకున్నా... బెల్లం కొట్టిన రాయిళ్లా ఎలా ఉండగలుతున్నారు..? రాజకీయంగా లాభం లేదనా..? కుల రాజకీయానికి తలొగ్గి వెనకడుగు వేస్తున్నారా..? రిషితేశ్వరి గురించి ఎవరు అడుగుతారు అని అనుకుంటున్నారా.? మరో రిషితేశ్వరి ఆత్మహత్యను ఆపడానికి అందరం కలిసి నడుం బిగిద్దాం. రండి ప్రశ్నిద్దాం.... రిషితేశ్వరి కేసులో న్యాయం జరిగే వరకు పోరడదాం...

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles