yakub memon | supreme court | plea | mumbaui attacks, death, lifetime jail

Sc to hear yakub memon s plea today

yakub memon, supreme court, plea, mumbaui attacks, death, lifetime jail

SC to hear Yakub Memon's plea today. the Supreme Court will hear a “limited” plea by Yakub Memon, the lone death row convict 1993 Mumbai serial blasts, that his death warrant was issued in undue haste before his legal remedies were exhausted.

యాకుబ్ మెమెన్ కు ఉరి..?జీవిత ఖైదు.? తేలేది నేడే

Posted: 07/27/2015 09:28 AM IST
Sc to hear yakub memon s plea today

1993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకూబ్ మెమన్ భవితవ్యం నేడు తేలనుంది. ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలంటూ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అటు మెమన్ కు మరణదండన సరికాదన్న వాదన కూడా బలపడుతోంది. క్షమాభిక్ష ప్రసాదించాలంటూ పలువురు ప్రముఖులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతి పత్రం ఇచ్చారు. యాకుబ్ మెమన్ ఉరిశిక్ష వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఒకవైపు ఈ నెల 30న ఆయన ఉరిశిక్షకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండగా.. మరోవైపు, మెమన్ కు మరణదండన సరికాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. న్యాయకోవిదులు, రాజకీయ నేతలు, సినీ తారలు మెమన్ ఉరికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు.

Also Read:  యాకూబ్ ఉరి వ్యాఖ్యలపై వెనక్కు తగ్గిన సల్మాన్ ఖాన్

యాకూబ్ మెమన్ ఉరిశిక్షను రద్దు చేసి, ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ పలువురు న్యాయ, రాజకీయ, సినీ ప్రముఖులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతి పత్రం ఇచ్చారు. ఉరిశిక్ష రద్దుకు అవసరమైన న్యాయపరమైన అంశాలను, అంతర్జాతీయ నిబంధనలను అందులో ఉటంకించారు. ముంబై పేలుళ్ల సూత్రధారి యాకూబ్ కాదని, మరెవరో చేసిన నేరానికి ఇతడికి ఉరిశిక్ష విధించడం సరికాదని అందులో పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన వినతిపత్రంపై సంతకాలు చేసిన నేతల్లో దాదాపు అన్ని పార్టీల వారు ఉన్నారు. అటు ఈ వ్యవహారాన్ని బీజేపీ తప్పు పట్టింది. మెమన్ ఉరిని వ్యతిరేకిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడింది.

Also Read:  యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై సల్మాన్ అభ్యంతరం

ఉరిశిక్షపై స్టే విధించాలంటూ యాకూబ్ మెమన్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. తన భర్త లొంగిపోయిన కారణంగా ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలంటూ యాకూబ్ భార్య రహీన్ విజ్ఞప్తి చేసింది. 1993 పేలుళ్ల కన్నా ముందే, ఈద్ పండుగ జరుపుకునేందుకే తాము దుబాయ్ వెళ్లామని, అంతేకానీ పేలుళ్ల తర్వాత దేశం విడిచిపారిపోలేదన్నారు. అటు మహారాష్ట్ర లోని నాగపూర్ జైల్లో ఉన్న యాకూబ్ ఉరిశిక్ష అమలుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 30న అతడికి ఉరిశిక్ష వేయాలని కోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ జైలు భద్రతను క్విక్ రెస్పాన్స్ టీం తన అధీనంలోకి తీసుకుంది. భద్రతలో భాగంగా 10 మంది సాయుధులైన పోలీసులు అత్యాధునిక ఆయుధాలతో జైలు లోపల, బయట అనుక్షణం కాపలా కాస్తున్నారు. కాగా ఉరి తర్వాత శాంతి భద్రతలకు ముప్పువాటిల్లే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ విభాగం ఇప్పటికే హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yakub memon  supreme court  plea  mumbaui attacks  death  lifetime jail  

Other Articles