Modi | Cashless treatment | accidents | Radio

Modi vows cashless treatment for road accident victims

Modi, Cashless treatment, accidents

Modi vows cashless treatment for road accident victims The government will expand across India its cashless treatment plan for road accident victims, PM Narendra Modi said in his monthly radio address on Sunday during which he talked about several social issues but steered clear of the ongoing Parliament standoff.

రోడ్డు ప్రమాదాల మీద మోదీ ఆందోళన.. కొత్త బిల్లును తీసుకువస్తామని వెల్లడి

Posted: 07/27/2015 09:25 AM IST
Modi vows cashless treatment for road accident victims

మన్ కీ బాత్ పేరుతో దేశ ప్రజలతో తన మనోగతాన్ని పంచుకునే ప్రధాని సామాజికాంశాలను చర్చకు తీసుకుంటున్నారు. ఇప్పటికే డ్రగ్స్ తీసుకోవడం మీద, ఆడపిల్లల సంరక్షణ మీద మనసులోని మాట చెప్పిన మోదీ తాజాగా నిత్యం చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల గురించి మాట్లాడారు. ప్రతి నిమిషానికో రోడ్డు ప్రమాదం జరుగుతోందని... ప్రతి నాలుగు నిమిషాలకో మరణం సంభవిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి మరణాలకు అడ్డుకట్ట వేయాలని, అందు కోసం రోడ్డు రవాణా, భద్రత బిల్లు త్వరలో తీసుకువస్తామని ఆయన చెప్పారు. అంతేకాక రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి నగదురహిత చిక్సిత అందించే పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అగష్టు 15న తాను చేయబోయే ప్రసంగంలో ఏయే అంశాలు ప్రస్తావించాలో సూచించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు.

Also Read:  రాజీవ్ గాంధీలాగా మోదీని కూడా హత్య చేయడానికి ప్లాన్

‘‘ ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. అందుకోసం తల్లిదండ్రులు వారి పిల్లలకు రోడ్డు భద్రత, నియమనిబంధనలపై అవగాహన కల్పించాలి.’’ అని ప్రధాని మోదీ వాఖ్యానించారు. రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారిలో అధికంగా 15-25 ఏళ్ళ వయస్సు కలిగిన యువతే కావడం మరింత బాధాకరమన్నారు. త్వరలో రోడ్డు భద్రత పాలసీని తీసుకొస్తామని, ఎంపిక చేసిన నగరాల్లో, రహదారులపై రోడ్డు ప్రమాదానికి గురైతే ఉచిత వైద్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన రోడ్డు రవాణా భద్రత బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు.

Also Read:  మోదీ సర్కార్ కు శివసేన మేకులా తయారైంది

ఇటీవల ఓ రైల్వే ఉద్యోగి రైల్వేకు సంబంధించిన అద్భుత చిత్రం గీశారని తెలిపారు. అతన్ని అభినందిస్తూ ప్రతి ‘‘కర్మచారి (ఉద్యోగి)..... కర్మయోగి’’గా మారాలని అన్నారు. కాగా, ప్రభుత్వం ప్రారంభించిన ‘‘మై గవ్‌’’ అనే వెబ్‌సైట్‌ను దాదాపు 2 కోట్ల మంది సందర్శించారన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల గురించి మాట్లాడిన మోదీ దేశంలోని పలు కీలక అంశాల మీద తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ ఏడాది వర్షాకాలం బాగా ప్రారంభం అయిందని, రైతులు ఖరీఫ్‌ పంటలు పండించేందుకు వర్షాలు దోహదపడుతాయని మోదీ తెలిపారు. దీనదయాళ్‌ ఉపాధ్యాయ్‌ గ్రామ జ్యోతి యోజ న కింద ప్రతి గ్రామానికి 24 గంటల పాటు విద్యుత్తు సరఫరా చేస్తామని తెలిపారు.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Cashless treatment  accidents  

Other Articles