BJP Leader Shatrughan Sinha Meets Nitish Kumar, Calls Him 'Guardian of Bihar'

Bjp red faced over shatrughan sinha s praise of nitish kumar

BJP Leader Shatrughan Sinha Meets Nitish Kumar, Calls Him 'Guardian of Bihar', BJP red-faced over Shatrughan Sinha's praise of Nitish Kumar, Nitish Kumar, Shatrughan Sinha, Narendra Modi, Bihar elections, Bihar elections 2015, Bihar polls, Bihar assembly elections, lalu prasad yadav, sinha calls nitish Guardian of Bihar, election campaign

PM Narendra Modi ripped into Nitish Kumar at a mega election rally in north Bihar's Muzaffarpur, one of his party leaders Shatrughan Sinha met the Bihar CM at his residence in Patna.

బీహార్ రాష్ట్ర సంరక్షకుడు నితిశే.. ప్రశంసించిన బిజేసీ ఎంపీ..

Posted: 07/26/2015 08:56 PM IST
Bjp red faced over shatrughan sinha s praise of nitish kumar

ప్రధాని నరేంద్రమోడీ బాహార్ ఎన్నికల ప్రచారానికి సమరశంఖం పూరించి.. తమకు ఒక్క సారి అవకాశమివ్వాలని బిహార్ రూపురేఖలను మారుస్తామని అభ్యర్థించిన మరుసటి రోజునే బిజేపి బీహార్ శ్రేణులకు షాక్ తగిలింది. ప్రధాని ప్రచారంతో ముందుకు సాగుదామనుకున్న పార్టీ శ్రేణులకు తమ పార్టీకి చెందిన నేత , పార్లమెంటు సభ్యుడైన శతృఘ్నసిన్హా నుంచి గట్టి ఎదురుదెబ్బను ఎదుర్కోన్నారు. ప్రధాని మోడీ నిన్న పార్టీ శ్రేణులల్లో కల్పించిన నూతన జవసత్వాలు ఇవాళ నీరుగారేలా చేశారు శతృఘ్నసిన్హా. అదేలా అంటారా..? ఇవాళ బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు కలసిన ఆయన నితీష్ కుమార్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

దేశంలోనే నితీశ్‌ కన్నా బెస్ట్ సిఎం ఎవ్వరూ లేరని కితాబునిచ్చారు. అంతేకాదు బిహార్ రాష్ట్రానికి నితిష్ గోప్ప సంరక్షకుడని కోనియాడారు. నితిశ్ కన్నా బిహార్ రాష్ట్రాన్ని ఎవ్వరూ అభివృద్ధిపథంలో తీసుకువెళ్లలేరని ప్రశంసిచ్చారు. బిహార్ సీఎం నితీశ్‌ కుమార్ ను ఆయన నివాసంలో కలుసుకున్న శతృఘ్నసిన్హా మంతనాలు కూడా జరిపారు. ఓ పక్క మోడీ నితీశ్‌ సర్కారును కూకటివేళ్లతో పెకిలించి వేయాలని బీహారీలకు పిలుపునిస్తుంటే సిన్హా మాత్రం నితీశ్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. దీంతో మోడీ నిన్న ముజాఫర్ పూర్ లో ప్రారంభించిన ఎన్నికల ప్రచారానికి ఇవాళ సోంత పార్టీ నేత ప్రశంసలతో కళ్లెం పడినట్లయ్యిందని బిజేపి వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.

ఈ మధ్యలో మరికోన్ని వదంతులు వినబడుతున్నాయి. నేడో రేపో ఆర్జేడీ అధినేత లాలూను కూడా కలుసుకోనున్న సిన్హా బిజెపిని వీడే అవకాశాలు కనపడుతున్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వకపోవడంపై కొంత కాలంగా ఆయన గుర్రుగా ఉన్నారు. పార్టీ అధిష్టానాన్ని బెదిరించేందుకే శతృఘ్నసిన్హా ఆర్జేడీ-జెడియూ నేతలతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారని బీహార్ బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు.  ఏదిఏమైనా ప్రధాని శ్రమకు ఫలితం లేకుండా చేయడంలో మాత్రం శతృఘ్నసిన్హా సఫలీకృతుడయ్యాడని రాజకీయ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar  Shatrughan Sinha  Narendra Modi  Bihar elections  

Other Articles