india to hand over dossier on dawood ibrahim in nsa meet

India back on dawood chase

BJP government, NDA government, two-pronged move, 1993 Mumbai blasts mastermind Dawood Ibrahim, terrorist Dawood Ibrahim, indian most wanted Dawood Ibrahim, ‘back door diplomacy’ negotiation, Enforcement Directorate (ED), Home Ministry officials, Dawood’s billion-dollar empire, Hafiz Saeed, Karachi home, Pakistan

NDA government has launched a two-pronged move to extradite terrorist Dawood Ibrahim from his upscale Karachi home in Pakistan

దావూద్ ఇబ్రహీం టార్గెట్ గా పావులు కదుపుతున్న కేంద్రం

Posted: 07/26/2015 12:44 PM IST
India back on dawood chase

వచ్చే నెలలో జరగబోయే జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో మోస్ట్ వాంటెడ్ దావూద్‌పై పూర్తి వివరాలతో కూడిన నివేదికను భారత్ పాకిస్థాన్‌కు అందజేయనుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దావూద్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను రూపొందిస్తోంది. దావూద్ పాకిస్థాన్‌లో ఎక్కడెక్కడ తలదాచుకున్నాడు, పాక్‌లో అతడి కార్యకలాపాలు తదితర విషయాలన్నీ ఈ నివేదికలో పొందుపరుస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌తో పాటు నిఘా సంస్థల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. దావూద్‌ను వదిలే ప్రసక్తే లేదని, అన్ని విధాలుగా అతడిని కట్టడి చేసేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దావూద్ పని పట్టేందుకు ఎనిమిది దేశాలతో కలిసి భారత్ చర్చలు జరుపుతోంది.

దావూద్‌కు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ రూపుమాపేందుకు వ్యూహం అమలు చేస్తోంది. 1993 వరుస బాంబు పేలుళ్లతో పాటు హత్యలు, బెదిరింపులు, అపహరణలు, మ్యాచ్‌ ఫిక్సింగ్, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా తదితర ఆరోపణలు కూడా ఉన్నాయి. దావూద్ అక్రమంగా నల్లధనం‌ సంపాదించి అండర్‌వల్డ్‌లో భారీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. పాక్‌లో తలదాచుకుంటూ భారత్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఎందరో అమాయకుల ప్రాణాలు తీశాడు. దావూద్‌కు సంబంధించిన పూర్తి వివరాలిచ్చినా అతడిని భారత్‌కు అప్పగించేందుకు పాకిస్థాన్ ససేమిరా అంటోంది. అసలు దావూద్ ఎవరో కూడా తమకు తెలీదన్నట్లు నటిస్తూ, అతడు తమ దేశంలో లేడని పొరుగుదేశం బుకాయిస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NDA government  1993 Mumbai blasts  mastermind Dawood Ibrahim  

Other Articles