Rajahmundry city to be renamed as Rajamahendravaram says ap cm naidu

Rajahmundry city to be renamed as rajamahendravaram n chandrababu naidu

Rajahmundry city to be renamed as Rajamahendravaram, godavari maha pushkaraalu, Rajamahendravaram, Rajahmundry, N Chandrababu Naidu, Andhra Pradesh Chief Minister, Rajahmundry in East Godavari district, Rajahmundry renamed as Rajamahendravaram,

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu has said the town of Rajahmundry in East Godavari district will get back its ancient name of Rajamahendravaram

ఇకపై రాజమండ్రి మళ్లీ రాజమహేంద్రవరంగా మారనుంది..

Posted: 07/26/2015 11:57 AM IST
Rajahmundry city to be renamed as rajamahendravaram n chandrababu naidu

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం రాజమండ్రిలో గోదావరి మహా పుష్కర వనం పైలాన్‌ను ఆవిష్కరించారు. దివాన్‌ చెరువు దగ్గర పుష్కర వనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడవులను అభివృద్ధి చేసుకోవడం, అలాగే అడవుల బయట విస్తీర్ణాన్ని పెంచుకోవడం లాంటివి నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా ఉన్నాయని ఆయన అన్నారు.  రాజమండ్రి పేరును 'రాజమహేంద్రవరం'గా మారుస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నిజానికి గతంలో ఈ పేరే ఉండేదని, కానీ, బ్రిటీష్ పాలకులు తమ ఉచ్ఛారణకు అనువుగా రాజమండ్రిగా పేరు మార్చారని గుర్తుచేశారు.

కాగా ఇపుడు మళ్లీ రాజమహేంద్రవరం పేరునే పునరిద్దరించి, నామకరణం చేయనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం నగరాన్ని రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ అభివృద్ధిలో భాగంగా ధవళేశ్వరం బ్యారేజీ చుట్టూ 35 కిలోమీటర్ల ప్రాంతాన్ని అఖండ గోదావరి ప్రాజెక్టుతో అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం రూ.100 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను చంద్రబాబు తిలకించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajamahendravaram  Rajahmundry  N Chandrababu Naidu  Andhra Pradesh Chief Minister  

Other Articles