Rahul Gandhi | AICC | AP PCC | AP congress, Congress, TDP, Rahul Tour

Rahul gandhi reached to anantapur just now

Rahul Gandhi, AICC, AP PCC, AP congress, Congress, TDP, Rahul Tour

Rahul Gandhi reached to Anantapur just now. AICC vice President Rahul gandi tour will start today in Anatapur dist.

అనంతలో రాహుల్ పర్యటన ప్రారంభం

Posted: 07/24/2015 08:37 AM IST
Rahul gandhi reached to anantapur just now

ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాకు చేరుకున్నారు. అనంతపురం కొడికొండ చెక్ పోస్ట్ కు చేరుకున్న రాహుల్ గాంధీకి ఏపి కాంగ్రెస్ నాయకులు భారీ స్వాగతం పలికారు. ఏపి పిసిసి చీఫ్ తో సహా పలువురు కీలక నేతలు రాహుల్ కు స్వాగతం పలికారు. అయితే రాహుల్ పర్యటనను నిరసిస్తు టిడిపి నాయకులు ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుండి తరలించారు. రైతుల సమస్యలు తెలుసుకుని, స్వయంగా పరామర్శించే లక్ష్యంతోనే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ ఇప్పటికే పెద్దస్థాయిలో ప్రచారం చేసింది. ఓబుళదేవర చెరువు వద్ద బహిరంగ సభలో ప్రసంగంతో అనంతరం రాహుల్ గాంధీ పది కిలోమీటర్ల పాదయాత్ర మొదలవుతుంది. 1979లో తన నాన్నమ్మ , దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ప్రసంగించిన ప్రదేశంలోనే రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.

Also Read:  డ్రగ్స్ తో పట్టుబడిన రాహుల్ గాంధీ..?

పదికిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా రైతులను పరామర్శించి, వారి సమస్యలను తెలుసుకుంటారు. అలాగే , నేత కార్మికులు, విద్యార్థులు, యువతతో మమేకమవుతారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. పాదయాత్ర ముగిసిన తర్వాత పుట్టపర్తి వెళ్లి శ్రీ సత్యసాయిబాబా మహాసమాధిని సందర్శిస్తారు. పాదయాత్రలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ , డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు సమర్పించడంతో పాటు జాతీయ ఉపాధి హామీ పథకం కార్మికులు, వలస కార్మికులతో నూ భేటీ జరుపుతారు. ఆత్మహత్యచేసుకుని చనిపోయిన హరినాథ్ రెడ్డి అనే రైతు కుటుంబాన్ని కూడా రాహుల్ పరామర్శిస్తారు. గత మే నెలలో తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో పాదయాత్ర జరిపారు.

Also Read:  మరో బాంబు పేల్చిన లలిత్ మోడీ.. రాహుల్, ప్రియాంకలను కలిశా..

రాష్ట్ర ప్రజలు, రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో రైతులు, చేనేత కార్మికుల సమస్యలు, వలసలు పెరిగిపోతున్నందున భరోసా ఇచ్చేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర, కేంద్ర పభుత్వాల వైఫల్యాలే ప్రజల సమస్యలకు కారణమని రఘువీరారెడ్డి విమర్శించారు. మరి ఏపి కాంగ్రెస్ కు రాహుల్ గాంధీ పర్యటన ఊపిరిపోస్తుందో లేదా అలానే వెంటిలేటర్ మీద ఉంటుందో చూడాలి.

Also Read:  ఇక లలిత్ మోదీ టార్గెట్ రాహుల్ గాంధీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles