Rahul Gandhi | Robert Vadra | beneficiaries | hospitality | lalit modi

Former ipl commissioner lalit modi dragged congress vice president rahul gandhi

Rahul Gandhi, Robert Vadra, beneficiaries, hospitality, lalit modi, Inhospitable, Climate, congress, ipl, ED, bjp, Vasundharajy, sushma swaraj

Former IPL commissioner Lalit Modi dragged Congress vice- president Rahul Gandhi Former IPL commissioner Lalit Modi dragged Congress vice- president Rahul Gandhi and his brother-in-law, Robert Vadra, into the ongoing controversy surrounding his links with the high and mighty.

ఇక లలిత్ మోదీ టార్గెట్ రాహుల్ గాంధీ

Posted: 07/05/2015 10:00 AM IST
Former ipl commissioner lalit modi dragged congress vice president rahul gandhi

ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ మరో ప్రముఖ నేతను రింగులోకి లాగాడు. ఐపీఎల్ సీజన్‌లో రాహుల్ గాంధీ తన ఆతిథ్యాన్ని స్వీకరించారని ట్వీట్ పేల్చాడు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించినా... ఇప్పటికే లలిత్ ఉచ్చులో పడి విలవిల్లాడుతున్న బీజేపీ నేతలకు కాస్త ఊరట లభించినట్లైంది. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ వల్లో చిక్కుకుని ఇప్పటికే డజనుకు పైగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు, క్రికెటర్లు ఒడ్డున పడిన చేపల్లా కొట్టుకుంటున్నారు. తాజాగా మరో పెద్ద చేపను క్రీజులోకి లాగాడు... లలిత్‌. తాను ఐపీఎల్ కమిషనర్‌గా ఉన్న సమయంలో... కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన ఆతిథ్యం స్వీకరించారని లండన్ నుంచి ట్వీట్ చేశాడు. దమ్ముంటే రాహుల్, సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా తన దగ్గర ఆతిథ్యం తీసుకోలేదని చెప్పమనండి అంటూ మరో ట్వీట్ పంపాడు. కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలియకుండానే ఇదంతా చేశారా? అంటూ ప్రశ్నించాడు.

అక్కడితో వదల్లేదు. రాహుల్, రాబర్ట్ వాద్రా... ఇతర సెలబ్రిటీలతో కూర్చొని ఉన్న ఓ ఫొటో రిలీజ్ చేశాడు. దీనిపై దుమారం రేగింది. కాంగ్రెస్ సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. లలిత్ ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ వర్గాలు... రాహుల్ ఎలాంటి ఆతిథ్యమూ స్వీకరించలేదని తెలిపాయి. ఐపీఎల్ సీజన్‌లో వాళ్లూ, వీళ్లని తేడాలేకుండా అందర్నీ వాడేసుకున్న లలిత్ మోడీ... ప్రస్తుతం లండన్‌లో దాక్కున్నాడు. అక్కడి నుంచే వరుసగా ట్వీట్లు పంపుతున్నాడు. వరుణ్ గాంధీ తనను లండన్‌లో కలిశాడనీ, సోనియాతో సెటిల్‌మెంట్ చేయిస్తానని ఆఫర్ ఇచ్చాడనీ కొన్ని రోజుల కిందటే లలిత్‌ ట్వీట్ చేశాడు. అంతకంటేముందే తాను లండన్‌లో ప్రియాంకాగాంధీ, రాబర్ట్ వాద్రాను ఓ  రెస్టారెంట్‌లో కలిశానని చెప్పాడు.

ఇప్పటికే కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే... లలిత్‌కు వీసా సాయం చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. లలిత్ బాధితుల జాబితాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఎన్సీపీ పెద్దలు శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ కూడా ఉన్నారు.
విదేశాల్లో క్రికెట్ మ్యాచ్‌లు జరిగినప్పుడు లలిత్ మోడీయే రాజకీయ నేతలకు హోటల్ రూమ్‌లు బుక్‌ చేశాడు. వీఐపీ గ్యాలరీ టిక్కెట్లు ఇచ్చాడు. ఈ చిన్న చిన్న సాయాలకు నేతలు తమవంతుగా అధికారాన్ని అడ్డం పెట్టి అక్రమాలకు ఊతం అందించారు. ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. రాజకీయ విమర్శలు ఎదుర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles