Chandrababu Naidu | Srinivas Goud | Guvvala Balraj, Assembly, Osmania, Nizam, Palamur Lift Irrigation

Trs mla srinivas goud questions chandrababu naidu that who build the assembly

Chandrababu Naidu, Srinivas Goud, Guvvala Balraj, Assembly, Osmania, Nizam, Palamur Lift Irrigation

TRS MLA Srinivas Goud questions Chandrababu naidu that who build the Assembly. TRS MLA Srinivas Goud suggested to Chandrababu naidu to keep his words.

చంద్రబాబు... అసెంబ్లీ మీ తాత కట్టిందా..?

Posted: 07/24/2015 08:14 AM IST
Trs mla srinivas goud questions chandrababu naidu that who build the assembly

ఏపీ సీఎం చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు. తెలంగాణ పట్ల చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న భవనం మీ తాత కట్టిందా? అని చంద్రబాబును ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. హైదరాబాద్ మహానగరంలో ఉన్న చారిత్రాక కట్టడాలన్నీ నిజాం పాలనలో నిర్మించినవేనని అన్నారు. అసెంబ్లీ భవనం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. ఏపీలో కలిసిన తర్వాతే తెలంగాణ ప్రాంతానికి ఈ దుస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అంటే ఏమిటో తెలియక.. ఏపీ చీకట్లో మగ్గుతుండగానే.. నిజాం పాలనలో తెలంగాణ ప్రాంతం వెలుగులు విరజిమ్మిందని తెలిపారు.

Also Read:  అమరావతి కాకపోతే.. ఆరావళి కట్టుకోండి: కేసీఆర్

తాగునీటి కోసం కట్టిన హుస్సేన్‌సాగర్‌ను మురికి నీటి సాగర్‌గా మార్చిన ఘనత ఆంధ్రా పాలకులదేనని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణపై చంద్రబాబు విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జోలికి వస్తే బాబుకు బుద్ధి చెబుతాం. ఖబర్ధార్ అని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు వరప్రసాదం లాంటి ఆర్డీఎస్‌ను పగులగొడుతామన్నప్పుడు మాజీమంత్రి డీకే అరుణ పౌరుషం ఎక్కడికి పోయిందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నించారు. రౌడీలు మాట్లాడే భాషను ఆమె మాట్లాడుతున్నారని ఆరోపించారు. మేము తురుంఖాన్‌లం కాకపోవచ్చు.. కానీ డీకే అరుణ లాగా గూండాలం కాదు అని ఆయన పేర్కొన్నారు.

Also Read:  హైద్రాబాద్ ముందు అమరావతి ఎంత? : కేసీఆర్

పదవుల కోసం పాకులాడారే తప్ప ఏనాడు కూడా పాలమూరు జిల్లా సమస్యలను డీకే అరుణ పట్టించుకోలేదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేసేలా సీమాంధ్రలో అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఆమె ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం సీఎం కేసీఆర్ ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి వలసలను ఆపుతామని బాలరాజు స్పష్టం చేశారు.

Also Read:  సెక్షన్ 8 పై కేసిఆర్ కు షాక్.. పార్లమెంట్ సాక్షిగా వెల్లడి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Srinivas Goud  Guvvala Balraj  Assembly  Osmania  Nizam  Palamur Lift Irrigation  

Other Articles