Fire accident | Rajahmundry | Godavari Pushkaralu, Chandrababu naidu

Fire accident in the godavari pushkaralu is accidental or any other reason

Fire accident, Rajahmundry, Godavari Pushkaralu, Chandrababu naidu

Fire Accident in the Godavari Pushkaralu is accidental or any misterious reason. The Dist. collector said that the govt have some doubts about the fire accident.

ITEMVIDEOS:పుష్కరాల్లో అగ్ని ప్రమాదం.. ప్రమాదవశాత్తు జరిగింది కాదా..?

Posted: 07/24/2015 08:07 AM IST
Fire accident in the godavari pushkaralu is accidental or any other reason

రాజమండ్రి లో ఘనంగా గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం అపూర్వంగా అద్భుతమైన సౌకర్యాలతో ఘనంగా పుష్కరాలను నిర్వహించింది. తొలిరోజు తొక్కిసలాట.. తప్ప.. మరో అవాంచనీయ ఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కోట్లాదిమందికి రాజమండ్రి ఆతిథ్యం ఇచ్చింది. మూడు కోట్లమందికి పైగా జనం ఇప్పటివరకూ ఒక్క రాజమండ్రిలోనే పుష్కర స్నానాలు చేశారు. రైళ్లు, బస్సుల్లో వస్తూనే ఉన్నారు. ఇసకేస్తే రాలనంత జనం. రెండు రాష్ట్రాల్లో పుష్కర యాత్రికులంతా ఒక ఎత్తు.. రాజమండ్రికి పుష్కరాలకు వచ్చిన భక్తులంతా ఒక ఎత్తు అన్నట్లు రాజమండ్రి పుష్కరాలు సాగాయి.

రాజమండ్రి ప్రజలు కూడా.. తమ ఇంటి పండుగ అన్న రీతిలో పుష్కరాలకు వచ్చిన జనానికి ఆతిథ్యం ఇచ్చారు. ప్రతి ఇంటివారు.. పుష్కర యాత్రికులకు ఉచితంగా భోజనాలు, టిఫెన్లు, పులిహోర వంటివి అందించారు.. ఆఖరికి పేదలుకూడా.. మంచినీళ్లో.. మజ్జిగో .. ఇచ్చి ఆతిథ్యం ఇచ్చినవారే. ఇంత ఘనంగా జరిగిన పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో ఓ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదం.. పలు వాహనాల దగ్ధం.. ప్రమాదవశాత్తూ.. జరిగిందా.. ఎవరైనా ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు జరిపిన కుట్రా.. అని పుష్కరాలకు వచ్చిన వరే.. వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న పుష్కరాలకు మచ్చ తెచ్చే యత్నం జరిగిందా...?

Also Read: రాజమండ్రి పుష్కర ఘాట్‌ వద్ద మళ్లీ ప్రమాదం..

రాజమండ్రిలో బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై పలు అనుమానాలున్నాయని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ కుమార్‌ తెలిపారు. ‘‘ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారితో మాట్లాడాను. వారు చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. విద్యుత్‌ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పిన ప్రకారం... అక్కడ విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌ కాలేదు. గ్యాస్‌ సిలిండర్లులేవు. ఈ ప్రమాదం కాదు. దీనికి కారణాలేమిటో పోలీసుల దర్యాప్తులో స్పష్టమవుతుంది’’ అని కలెక్టర్‌ తెలిపారు. ఇక... ప్రమాద కారణాలపై ఆధారాలు సేకరిస్తున్నామని డీజీపీ రాముడు తెలిపారు. డీఐజీ స్థాయి అధికారికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Also Read:  చంద్రబాబు షూటింగ్ వల్లే అంతమంది చనిపోయారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fire accident  Rajahmundry  Godavari Pushkaralu  Chandrababu naidu  

Other Articles