modi exchanges pleasantries with oppositon leaders in rajya sabha

Pm narendra modi exchanges pleasantries with oppositon leaders in rs

pm narendra modi exchanges pleasantries with oppositon leaders in rs, rajya sabha, gulam nabi azad, anand sharma, lalit modi controversary, sushma swaraj, vasundara raje, madya pradwsh, shivraj singh chouhan, New Delhi, Narendra Modi, Parliament, Vyapam scam, Lalit Modi, narendra modi, manmohan singh, opposition leaders, rajya sabha, question hour, left party leaders raja and yechury,

Amid the ongoing stalemate in both Houses of Parliament over the Vyapam and Lalit Modi row, Prime Minister Narendra Modi today exchanged pleasantries with opposition leaders in Rajya Sabha, in an apparent attempt to reach out to them.

అలా కలసి.. మొత్తానికి మోడీ వారిని చల్లబర్చారు..

Posted: 07/23/2015 10:36 PM IST
Pm narendra modi exchanges pleasantries with oppositon leaders in rs

వ్యాపం కుంభకోణం, లలిత్ మోదీ వీసా వివాదంలో చిక్కుకున్న కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రుల అంశాలపై అధికారపక్షాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న ప్రతిపక్ష నాయకులకు ప్రధాని నరేంద్రమోడీ విస్మయానికి గురిచేశారు. అటు అధికార పక్షాన్ని ఊపిరి సల్పుకోనీయకుండా ఉభయ సభల్లో పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకున్న ప్రతిపక్షాలను ఆయన ఆశ్చర్యంలో ముంచెత్తారు.  రాజ్యసభను చైర్మెన్ అన్సారీ వాయిదా వేసే కొద్ది సమయం ముందు వ్వశ్చన్ అవర్ లో ప్రధాని మోడీ సభలోకి ప్రవేశించారు. వాయిదా అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ దగ్గరకు వెళ్లి నమస్కరించారు.

ఆ తరువాత ప్రతిపక్ష నాయకులకు దగ్గరకు వెళ్లి పేరుపేరునా పలకరించారు. మన్మోహన్ సింగ్ తరువాత ప్రతిపక్ష నాయకుడు గులాంనబి అజాద్ వద్దకు వెళ్లి షేక్ భ్యాండ్ ిచ్చారు. వడోదల లోక్ సభ నియోజకవర్గంలో తనపై పోటీ చేసి ఓడిపోయిన మధుసూదన్ మిస్త్రీతో కరచాలనం చేశారు. రాజ్యసభ విపక్ష్ ఉపనేత ఆనంద్ శర్మకు నమస్కరిస్తూ పలకరించారు. కరణ్ సింగ్, జయరామ్ రమేశ్ లతో మాట్లాడారు. తర్వాత ట్రెజరీకి బెంచీలకు వద్దకు తిరిగి వచ్చిన ప్రధాని వామపక్ష నేతలను కూడా పలకరించారు. ముందుగా సిసీఐ నేత డి.రాజా, తమ పార్టీ ఎంపీలను పలకరించారు. ఈ సందర్భంగా పలువురు గుజరాత్ ెంపీలు ప్రధాని తో మాట్టాడేందుకు పోటీ పడ్డారు. అయితే సుష్మస్వారజ్, వసుందర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ ల రాజీనీమాలకు పట్టుబడుతూ పార్లమెంట్ ఉభయ సభలను విఫక్షాలు అడ్డుకుంటున్న నేపథ్యంలో మోడీ వ్యూహాత్మకంగానే ఇలా వచ్చి వాతావరణాన్ని చల్లబర్చారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  manmohan singh  opposition leaders  rajya sabha  question hour  

Other Articles