States can grant remission to life convicts: Supreme Court

Death penalty better than entire life behind bars sc

Tamil Nadu government, tamil nadu, Supreme Court, state government, Rajiv Gandhi, Chief Justice, Chandra Ghosh Abhay Manohar Sapre, Supreme Court, life convict, CBI, HL Dattu, former prime minister Rajiv Gandhi, Rajiv Gandhi assassination case

The Supreme Court on Thursday said state governments could grant remission and set free life convicts whose cases have not been investigated by the CBI or those not probed under central laws.

క్షమాభిక్షలో నిబంధనల సడలింపు.. ఇక రాష్ట్రాలకూ అధికారాలు

Posted: 07/23/2015 10:28 PM IST
Death penalty better than entire life behind bars sc

జీవిత ఖైదు శిక్ష పడిన ఖైదీల జీవితాంతం జైలు గోడల వెనుక బతుకులు ఈడవడం కన్నా మరణ శిక్ష వారికెంతో నయమని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జీవిత ఖైదు శిక్ష పడిన ఖైదీలకు కూడా క్షమాభిక్షను పెట్టవచ్చునని తెలిపింది. ఇప్పటివరకు క్షమాబిక్షపై ఉన్న నిభంధనలను కూడా స్వల్పంగా సడలిస్తూ.. ఇకపై జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న ఖైదీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనుకుంటే క్షమాబిక్ష పెట్టవచ్చుని అత్యున్నత న్యాయస్థానం పేర్కోంది.

మాజీ ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులుగా తేలి శిక్షను అనుభవిస్తున్న ఖైదీల కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం గతంలో తాను ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నింబంధనలతో జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ఇవ్వోచ్చని తెలిపింది. అయితే జీవితాంతం, శిక్ష అనుభవించాలని ఇచ్చిన తీర్పులతో మాత్రం క్షమాబిక్ష వర్తించబోదని స్పష్టం చేసింది. అలాగే నిర్ధారిత కాలం పాటు తప్పనిసరిగా జైల్లోనే ుండాలని తీర్పు ఇచ్చిన సందర్భంగాలలో కూడా క్షమాభిక్ష ఇవ్వడానికి వీలులేదని న్యాయస్థానం వెల్డించింది

సిబిఐ లాంటి కేంద్ర సంస్థలు దర్యాప్తు చేయకుండా, రాష్ట్రానికి చెందిన సిట్ లాంటివి దర్యాప్తు చేస్తే క్షమాభిక్ష ఇవ్వచ్చని తెలిపింది. అత్యాచారం హత్యా లాంటి నేరాలు కాకుండా ఇతర ఐసిసీ సెక్షణ్ల కింద శిక్షలు పడినప్పుడు కూడా క్షమాభఇక్ష ఇవ్వచ్చని వివరించింది. అయితే ప్రస్తుత ఉత్తర్వులు రాజీవ్ గాంధీ హత్యేకేసుకు వర్తించబోవని కూడా అత్యున్నత న్యాయస్థఆనం తెలిపింది. ఈ కేసు ప్రస్తుతం ఇంకా విచారణలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  life convict  CBI  HL Dattu  

Other Articles