Kejriwal | AAP | LG | Najeeb Jung | Swathi Maliwal

Najeeb jung told me stay away from office says dcw chief swati maliwal

Kejriwal, AAP, LG, Najeeb Jung, Swathi Maliwal

Najeeb Jung told me stay away from office, says DCW chief Swati Maliwal Hours after Lieutenant Governor Najeeb Jung termed her appointment as the chairperson of Delhi Commission for Women (DCW) “illegal”, Swati Maliwal claimed that the L-G’s office has asked her not to attend office or sign any files.

ఢిల్లీలో మరోసారి ఆప్‌, ఎల్జీల మధ్య 'జంగ్‌'

Posted: 07/23/2015 11:13 AM IST
Najeeb jung told me stay away from office says dcw chief swati maliwal

ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ల మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం మరింత ముదిరింది. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అనేక ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పలువురు మేధావులు, న్యాయస్థానాలు చెబుతున్నా, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆప్‌ను అష్టకష్టాలకు గురి చేస్తూనే ఉంది. ఆప్‌ పాలనను స్తంభింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెరవెనుక నుంచి పావులు కదుపుతోంది.ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఆప్‌ ప్రభుత్వాన్ని అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో బిజెపి ఢిల్లీని కైవశం చేసుకునేందుకు గట్టి ప్రయత్నం చేసింది. కానీ ఢిల్లీ ప్రజలు మాత్రం ఆప్‌కే పట్టం కట్టారు.

Also Read:  ఆప్ పార్టీకి పైసల కటకట.. కేజ్రీవాల్ ప్రకటన

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 60 కాగా, 57 స్థానాలను ఆమ్‌ ఆద్మీ పార్టీ, కేవలం 3 స్థానాలను బిజెపి గెలుచుకుంది. ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టంలేదు. అందువల్లనే ఆప్‌ పాలనను స్తంభింప జేయాలని బిజెపి ప్రయత్నిస్తున్నదని ఇటీవల విమర్శలు వెల్లువెత్తాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని పరిపాలన చేయకుండా ఇబ్బందులకు గురి చేయడం మాను కోవాలని దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైన కేంద్రం పట్టించుకోవడం లేదు. పైగా తన చర్యలను మరింత ఉధృతం చేసింది. దీంతో అప్‌ ఎల్జీల మధ్య ఏర్పడిన విభేదాలు వీధిల్లోకి వచ్చాయి. కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహిస్తున్న ఆప్‌ నాయకుడు దిలీప్‌పాండేను మోటారుతో ఢీకొట్టించి చంపి వేయాలని పథకం వేసినట్లు ఆప్‌ నాయకులు ఆరోపించారు.

Also Read:  తిట్లు తినడంలో మోదీ, కేజ్రీవాల్ పోటీ.. నెట్ లో హల్ చల్

తాజాగా ఢిల్లీ మహిళా కమిషనర్‌ నియామకం చెల్లదని చెప్పడంతో వివాదం పతాక స్థాయి చేరింది. ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ల మధ్య నియామక వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరి మధ్య మరో వివాదం చోటుచేసుకుంది. ఢిల్లీ మహిళా కమిషనర్‌గా స్వాతి మలివాల్‌ను నియమిస్తూ మూడు రోజుల క్రితం ఆప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నియామకం చెల్లదని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సిఎం కార్యాలయానికి లేఖ రాశారు. నియమ నిబంధనల ప్రకారం నియామకం జరగలేదని గవర్నర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.అయితే నిబంధనల ప్రకారమే ఆమె నియామకం జరిగిందని ఆప్‌ పార్టీ వివరించింది.

Also Read:  ఢిల్లీ యువతి హత్య ఘటనపై నివేదిక కోరిన ప్రభుత్వం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kejriwal  AAP  LG  Najeeb Jung  Swathi Maliwal  

Other Articles