Delhi girl stabbing: Kejriwal summons BS Bassi, slams PM Modi for deteriorating law and order

Delhi govt seeks report from bassi in girl murder case

Delhi govt seeks report from Bassi in girl murder case, Anand Parbat stabbing case, Arvind Kejriwal, Narendra Modi, Delhi Police, Aam Aadmi Party, Women,The National, senior official, Minakshi, Manish Sisodia, District magistrate, Delhi Police, Commissioner

Chief Minister Arvind Kejriwal on Saturday met the family members of the 19-year-old girl who was brutally stabbed to death in the capital's Anand Parbat locality and asked PM Narendra Modi to improve the law and order situation or transfer the powers of Delhi Police under the state government.

ఢిల్లీ యువతి హత్య ఘటనపై నివేదిక కోరిన ప్రభుత్వం

Posted: 07/18/2015 10:08 PM IST
Delhi govt seeks report from bassi in girl murder case

ఢిల్లీలో 19ఏళ్ల యువతిని అతి దారుణంగా పొడిచిన ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీని ఆదేశించింది. బాధితురాలి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారిం ప్రకటించింది. ఢిల్లీలోని ఆనంద్ పర్బాత్ ప్రాంతంలో ఇద్దరు సోదరులు ఈవ్‌టీజింగ్ కు పాల్పడుతుండగా వారిని అడ్డుకున్న యువతిని పొడిచి చంపారు. ఈ విషయమై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన అప్ ప్రభుత్వం నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఆనంద్‌ పర్వత్‌ ప్రాంతానికి చెందిన మీనాక్షి(19)పై ఆమె ఇంటికి పొరుగునే ఉంటున్న జై ప్రకాష్‌(21), అతని సోదరుడు గతంలో వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై ఆమె 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి మీనాక్షి.. సమీపంలోని మార్కెట్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇది గమనించిన దుష్ట సోదరులిద్దరూ ఆమెను వెంబడించి, అడ్డు నిలబడి మరోసారి వేధింపులకు పాల్పడ్డారు. దీంతో మీనాక్షి వాళ్లిద్దరిపైనా తిరగబడింది. దీంతో రెచ్చిపోయిన సోదరులు తొలుత దాడికి దిగడంతో మీనాక్షి తప్పించుకునేందుకు యత్నించింది.

దీంతో మరింతగా రెచ్చిపోయిన ముష్కరులు తమ వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డారు. విచక్షణ రహితంగా ఆమెను కత్తితో పొడిచారు. నెత్తురోడుతున్న శరీరంతో ఆర్తనాదాలు చేస్తూ పరుగెత్తిన మీనాక్షి... సమీపంలోని ఓ భవనంలోకి ప్రవేశించి తనను రక్షించమని వేడుకుంది. అయితే, ఆ ఇంట్లోనివారు ఆమెను బయటకు నెట్టి తలుపులు మూసేశారు. దీంతో ముష్కరులు ఆమెపై మరోసారి దాడి చేసి పలుమార్లు కత్తితో పొడిచారు. దీంతో మీనాక్షి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే ముష్కర సోదరులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాధితురాలి పట్ల స్థానికులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని మీనాక్షి సోదరి కన్నీరుమున్నీరైంది. ఈ ఘటనపై ఆప్ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఢిల్లీలో పోలీసులు ఏం చేస్తున్నారంటూ మండిపడింది. ఢిల్లీ పోలీసులు ఢిల్లీ ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించలేని పరిస్థితిలో వున్నారని విమర్శించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Girl murder case  Newdelhi  kejriwal government  

Other Articles