Kejriwal | ARvind Kejriwal | Delhi | AAP | Funds | Aam Admi Party

We are broke says arvind kejriwal in appeal for funds

Kejriwal, ARvind Kejriwal, Delhi, AAP, Funds, Aam Admi Party

We are broke says Arvind Kejriwal in appeal for funds Delhi Chief Minister Arvind Kejriwal is known for turning to the people when he is facing trouble, and he has done it again on Tuesday saying the Aam Aadmi Party was short of funds and sought public support.

ఆప్ పార్టీకి పైసల కటకట.. కేజ్రీవాల్ ప్రకటన

Posted: 07/15/2015 04:38 PM IST
We are broke says arvind kejriwal in appeal for funds

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ తాజాగా ఓ బహిరంగ ప్రకటన చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వంతో వస్తున్న ఇబ్బందులపైనో...లెఫ్ట్ నెంట్ గవర్నర్ తో విభేదాలపైనో కాదు. ఈసారి సొంతపార్టీ విషయంపైనే బహిరంగ ప్రకటన చేశారు. పార్టీలో నిధులకు చాలా ఇబ్బందిగా ఉందట. రోజువారీ నిర్వహణకు కూడా కటకట ఎదురవుతోందట. పార్టీ మద్దతుదారులు, అభిమానులంతా మళ్లీ తలా ఓ చేయి వేయాల్సిందేనంటున్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది, మరెన్నో సంక్షోభాలు చవిచూసింది! అధికారాల కోసం తెగతపన పడింది. అటు కేంద్రంతో ఇటు రాష్ట్ర గవర్నర్ తో ఫైట్ చేస్తూనే ఉంది. ఇక పార్టీ పరంగా కూడా...సంక్షోభాన్ని ఎదుర్కొంది. ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్ ను పట్టుపట్టి మరీ బయటకు సాగనంపింది. పార్టీ క్రియాశీలకంగా పని చేసేందుకు ప్రయత్నిస్తోంది కానీ, అడుగు ముందుకు పడడంలేదు. కారణం...ఒక్కటే! ఆమ్ ఆద్మీ పార్టీలో నిధులు ఆవిరయ్యాయి.

తీవ్రంగా ఆలోచించిన కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ద్వయం..మళ్లీ ప్రజల్నే ఆశ్రయిద్దామని నిర్ణయించారు. ముఖ్యమంత్రి అయినా కానీ, పార్టీ నిధుల కోసం ప్రజల్నే ఆశ్రయిస్తున్నానంటూ బహిరంగంగా ప్రకటించారు. పార్టీని నమ్మి నిధులిచ్చి సహకరించారని...ఓటర్లు కూడా ఆదరించి, అధికారం అప్పగించారని ప్రశంసించారు. అవినీతి అక్రమాలతో పార్టీకి సొమ్ము సంపాదించడం కష్టమేమీ కాదని..కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ అలాంటిది కాదని, బల్లకింద చేతులుపెట్టి డబ్బు సంపాదించే పార్టీ కాదని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ రోజువారీ కార్యకలాపాలకు కూడా డబ్బు కొరత ఎదురవుతోందని...మద్దతుదారులంతా మళ్లీ నిధులిచ్చి సహకరించాలని కోరారు. నిధుల రూపంలో వచ్చే ప్రతిపైసాకు లెక్కలుంటాయని, ఒక్కరూపాయి కూడా దుర్వినియోగం కాకుండా చూస్తున్నామన్నారు కేజ్రీవాల్.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kejriwal  ARvind Kejriwal  Delhi  AAP  Funds  Aam Admi Party  

Other Articles