Beggars | Godavari Pushkaralu | Rajahmundry | Singapur | AP govt, Chandrababu naidu

Ap govt bumper offer to beggars at godavari pushkaralu

Beggars, Godavari Pushkaralu, Rajahmundry, Singapur, AP govt, Chandrababu naidu

ap Govt bumper offer to beggars at Godavari Pushkaralu. AP govt offer ten thousand rupees to beggars who will stay in the govt shelters and who dont beg till the end of godavari pushkaralu.

బిచ్చగాళ్లకు పదివేలు ఇస్తామన్న ఏపి సర్కార్.. కానీ

Posted: 07/20/2015 11:04 AM IST
Ap govt bumper offer to beggars at godavari pushkaralu

మీరు చదివిన వార్త అక్షరాల నిజం.. బిక్షగాళ్లకు పదివేలు అన్న మాట వాస్తవం... దాన్ని బిక్షగాళ్లు రిజెక్ట్ చేసిన మాట కూడా వాస్తవం. అసలేంటి...? ఎందుకు ఆఫర్ చేశారు..? ఎవరు ఆఫర్ చేశారు..? మరి బిక్షగాళ్లు ఎందుకు వద్దన్నారు.? ఇలా సవాలక్ష ప్రశ్నలు అన్నింటికి ఈ ఆర్టికల్ లో సమాధానాలు దొరుకుతాయి. దరిద్ర భారతావని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఏవైనా జాతరలు, పుష్కరాలు, కుంభమేళాలు లాంటివి ఉంటే బిక్షగాళ్లు కూడా అక్కడికి చేరుకుంటారు. అయితే అక్కడికి చేరుకుని తమ వృత్తి చేసుకుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ఎంతో మంది బిక్షగాళ్లు గోదావరి తీరాలకు చేరుకుంటున్నారు. అలా చేరుకున్న వారి కోసమే ఏపి ప్రభుత్వం ఓ బంపరాఫర్ ఇచ్చింది. ఆరు రోజులకు గాను పది వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది.

అవును పుష్కరాలు ఇంకా ఆరు రోజులు ఉన్నాయి.. ఈ ఆరు రోజులకుగాను పది వేల రూపాలను ఇస్తామని ఏపి ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. అవును ఇంతకీ వాళ్లు ఏం చెయ్యాలి అనుకుంటున్నారా..? ఏమీ చెయ్యకుండా ఉండాలి.  అవును ఏమీ చెయ్యకుండా ఉంటే చాలు పది వేలు ఇస్తారు. అది కూడా తిండి పెట్టి, వసతి కల్పించి మరీ పది వేలు ఇస్తారు. అయినా ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..? ఏపిలో ఎంతో ఘనంగా జరుగతున్న పుష్కరాల మిగిలిన ఆరు రోజులు బిక్షగాళ్లు కనిపించకుండా ఏపి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అవును ఇంతకీ ఏపి ప్రభుత్వం ఇలా ఎందుకు చెయ్యాలని అనుకుంటోందనేగా మీ డౌట్. అయితే పూర్తిగా చదవండి.

ఏపి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి గోదావరి మహా పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. అయితే ఇలా నిర్వహిస్తున్న పుష్కరాల్లో తమ జేబులు నింపుకోవడానికి ఎంతో మంది బిక్షగాళ్లు గోదావరి నదీ తీరాలకు చేరుకున్నారు. అయితే తాజాగా సింగపూర్ ప్రతినిధి బృందం రాజమండ్రిలో జరుగుతున్న గోదావరి పుష్కరాలకు హాజరై.. పుణ్యస్నానాలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇలా వచ్చిన వారికి బిక్షగాళ్లు కనిపిస్తే బాగుండదని అనుకున్నారేమో అందుకే ఇలా బిక్షగాళ్లకు బంపరాఫర్ ఇచ్చి.. పుష్కరాల వద్ద కనిపించకుండా చెయ్యాలని చూస్తోంది ప్రభుత్వం. అయితే దీనికి చాలా మంది బిక్షగాళ్లు ఒప్పుకోలేదట. మమ్మల్ని మా పని చేసుకోనివ్వండి అంటూ వెళ్లి పోయారట. మొత్తానికి ఏపి ప్రభుత్వం భలే ఆఫర్ పెట్టింది. అయితే గతంలోనూ చంద్రబాబు నాయుడు ఇలాంటి ఘన కార్యమే చేశారు. హైటెక్ సిటి ప్రారంభానికి వచ్చిన బిల్ క్లింటన్ ముందు డాబు ప్రదర్శించడానికి బిక్షగాళ్లను ప్రభుత్వ వాహనాలలో సిటికి దూరంగా తరలించారు.

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Beggars  Godavari Pushkaralu  Rajahmundry  Singapur  AP govt  Chandrababu naidu  

Other Articles