KCR | Talasani | Telangana | Minister | TDP, Congress, Shabbir Ali

What kcr will say about talasani srinivas

KCR, Talasani, Telangana, Minister, TDP, Congress, Shabbir Ali

What kcr will say about Talasani srinivas . Telangana cm KCR didnt speak even one word about his minister Talasani Srinivas Yadav

కేసీఆర్ తలసానిని ఇంకా వెనకేసుకొస్తావా..?

Posted: 07/20/2015 10:26 AM IST
What kcr will say about talasani srinivas

తలసాని శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొంది.. తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని కారెక్కారు. అయితే ఇలా ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉండి.. మరోపార్టీలోకి మారడం.. ఏకంగా మంత్రి పదవి కూడా దక్కించుకోవడం రాజకీయంగా ఎంతో సంచనలంగా నిలిచింది. అయితే తలసాని మీద అన్ని పార్టీలు మండిపడుతున్నాయి. ఒక్క టిఆర్ఎస్ తప్ప మిగిలిన అన్ని పార్టీలు తలసాని మీద విమర్శలు గుప్పించాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినా.. తాను రాజీనామా చేశానని, అది స్పీకర్ పరిశీలనలో ఉంది అని గతంలో చెప్పుకొచ్చారు. అయితే తాజాగా అసలు తలసాని శ్రీనివాస్ రాజీనామా లేఖ తమకు అందనే లేదని స్పీకర్ కార్యాలయం తెలిపింది. దాంతో అన్ని పక్షాల నేతలు తలససాని మీద, కేసీఆర్ మీద అలాగే గవర్నర్ మీద కూడా మండిపడుతున్నారు.

తలసాని అందరిని చీటింగ్ చేస్తున్నారని తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. రాజీనామా చెయ్యకుండా చేశానని అందరిని మోసం చెయ్యడమే కాకుండా.. నాటకాలు ఆడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే తలసాని వైఖరి మీద ఎవరు ఎంతలా గొంతు చించుకుంటున్నా కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో గవర్నర్, రాష్ట్రపతి వరకు తలసాని వ్యవహారం వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే తాజాగా తలసాని రాజనీమా డ్రామా వెలుగులోకి రావడంతో విషయం వివాదాస్పదంగా మారింది.

తలసాని శ్రీనవాస్ వ్యవహం ఇది..
* తలసాని మంత్రి పదవి చేపట్టక ముందు ఆరు నెలల క్రితమే టిడిపి పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. కానీ అది అబద్దం
* తలసానిని తెలుగుదేశం పార్టీ నుండి టిఆర్ఎస్ లోకి ఆహ్వానించే సమయంలో అన్ని పదవులకు రాజీనామా చేయించి పార్టీలోకి చేర్చుకోవాల్సింది. కానీ అలా టిఆర్ఎస్ పార్టీ చెయ్యలేదు. ఇది తప్పే
* పార్టీ ఫిరాయింపుల చట్టం ఖచ్చితంగా తలసానికి వర్తిస్తుంది.
* ఇంత జరుగుతున్నా కేసీఆర్ మౌనానికి అర్థం ఏంటో వివరణ ఇవ్వాలి.
* రానున్న హైదరాబాద్ మహా నగరపాలక ఎన్నికల నేపథ్యంలొ తలసాని లాంటి నేతలను పార్టీ అస్సలు వదులకునేందుకు సిద్దంగా లేదు.
* హైదరాబాద్ లో ముందు నుండి టిఆర్ఎస్ పార్టీకి పట్టుతక్కువ అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తలసాని శ్రీనివాస్ లాంటి నేతలను వదులుకోవాలని అనుకోవడం లేదు.
* ఒక వేళ బర్తరఫ్ చేస్తే పార్టీ పరువు పోతుందన్న కోణంలో కూడా టిఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుండవచ్చు.


//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Talasani  Telangana  Minister  TDP  Congress  Shabbir Ali  

Other Articles