దేశంలో గుజరాత్ తర్వాత మా రాష్ట్రానికే మిగులు బడ్జెట్ ఎక్కువగా ఉంది అని గర్వంగా ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... తాజాగా పరిణామాలతో అయోమయంలో పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు పథకాలకు నిధుల కొరత వేధిస్తోంది. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, కృష్ణా, గోదావరి నదుల మీద కడుతున్న ప్రాజెక్టులు, పేదలకు డబుల్ బెడ్ రూంలు, వెనకబడిన, షెడ్యూల్ జాతులు, తెగల వారికి సంబందించిన వారి కోసం, మైనార్టీలు, స్త్రీలకు సంబందించిన పలు పథకాలను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో వ్యయంతో నిర్వహిస్తోంది. అయితే రూపాయి రాక గురించి బీరాలు పలికిన పాలకులు రూపాయి పోక మీద మాత్రం దృష్టి పెట్టడం లేదు. అందుకే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరతతో బాధపడుతోంది.
లక్ష కోట్లకు పైగా బడ్జెట్ ను జబ్బలు చరుస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టి మీసాలు మేలేశారు తెలంగాణ పాలకులు కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి తారుమారైంది. ఖజానా ఖాళీ అయింది. రాబడి కన్నా వ్యయం పెరిగిపోవడంతో సర్కార్ కు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అందుకే కనిపించిన నిధులన్నింటిని ఖజానాకు మళ్లిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పధకానికి కేటాయించిన 500కోట్ల రూపాయలను కూడా తెలంగాణ సర్కార్ ఖజానాకు మళ్లించింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపిలో పరిస్థితి వేరు. ముందు నుంచి ఏపి ఖజానా వెలవెలబోతోంది. అందుకే అప్పుల మీద ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. తాజాగా కనీసం 5వేల కోట్లను విడుదల చెయ్యాలని లేఖ కూడా రాసింది. అంతకు ముందు ేపి సర్కార్ 23,650 కోట్లు కావాలని కూడా లేఖ రాసింది. కానీ ఏపిలాగా తెలంగాణ ప్రభుత్వం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రాల జాబితాలో టాప్ 2లో ఉంది కాబట్టి.
తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నుల ద్వారా వచ్చే పన్ను ఆదాయం.. 391256 కోట్లు, అదే సమయంలో వడ్డీ, పెన్షన్ లకు.. 369284 కోట్లు ఖర్చు కాగా మిగులు 21, 972 కోట్లు. అయితే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులు విపరీతంగా పెరిగిపోవడంతో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వ విధించే టాక్స్ లో తెలంగాణ వాటాను 2.91 నుండి 2.48శాతానికి కుదించింది. దాంతో ప్రస్తుతం తెలంగాణ కు వస్తున్న ఆదాయం కేవలం 12823 కోట్లు .
ఇక స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ 1363 కోట్లు... జ్యుడీషియరీ వర్క స్పెషల్ గ్రాంట్ కోస్ 209 కోట్లు వస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న పధకాల పుణ్యమా అని నిధులు మంచినీళ్లలా ఖర్చవుతున్నాయి. దాంతో ప్రస్తుతం్ తెలంగాణ ప్రభుత్వం కాసులకు కటకటలాడుతోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఖజానా లోటు ఇప్పటికే 2500 కోట్లు దాటిపోయింది. ఏప్రిల్ , మే నెలల్లో రాష్ట్ర ఖజానాకు వచ్చిన రెవెన్యూ ఆదాయం రూ. 7,261 కోట్లు కాగా, అదే సమాయానికి తెచ్చిన 2 వేల కోట్లకు పైగా అప్పుతో ఆదాయం 9,౬98 కోట్లకు చేరింది. ఈ రెండు నెలలలో రెవెన్యూ వ్యయం 8,500 కోట్లు దాటింది. ప్రణాళిక వ్యవయంతో కలిపితే మొత్తం 10,921 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 1200 కోట్ల రూపాయల లోటు నెలకొంది. ఈ రెండు నెలల లోటును పూడ్చుకునే లోగా జూన్ నెలలో చోటు చేసుకున్న పరిణామాలు తెలంగాణ సర్కార్ ను మరింత కుంగదీశాయ్ ఎక్సైజ్ అమ్మకాలపై చెల్లించాల్సిన బకాయిల కింద ఐటీ శాఖ ఆర్బీఐ నుంచి 1260 కోట్లను సీజ్ చేయడంతో ఆర్థిక నిధుల నిర్వహణ ఒక్కసారిగా తలకిందులైంది.
ఇంత జరుగుతున్నా కానీ తెలంగాణ సర్కార్ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఖజానా పరిస్థితి ఇలా ఉన్నా కానీ ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అయితే తెలంగాణ సర్కార్ చేస్తున్న విపరీతమైన ఖర్చు కారణంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మీద ప్రభావం పడే అవకాశాలు క్లీయర్ గా ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 24 పథకాలలో చాలా వాటికి తెలంగాణ సర్కార్ చరమగీతం పాడింది. కేంద్రం మూల ధన ఖర్చును మాత్రమే భరించే పథకాల జోలికి వెళ్లడం లేదు తెలంగాణ సర్కార్. భవిష్యత్ లో ఇలా కొనసాగితే రాష్ట్ర ఖజానా ఖాళీ కావడమే కాకుండా కేవలం ఉద్యోగుల జీతాలకు, పెన్షన్ లకు, అప్పుల మీద వడ్డీలు కట్టడానికి తప్ప ఒక్క రూపాయి కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ సర్కార్ ఇస్పటికైనా మేల్కొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిది. లేదంటే తెలంగాణ సర్కార్ పని గోవిందా..గోవింద
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more