TMC MP Abhishek Banerjee says Mamata government killed Maoist leader Kishenji

Mamata govt killed kishenji says tmc mp abhishek banerjee

Mamata govt killed Kishenji, says TMC MP Abhishek Banerjee, Kishenji, Maoists, Trinamool Congress (TMC), Mamata Banerjee, Abhishek Banerjee, West Bengal, All India Trinamool Youth Congress, West Bengal, Abhishek Banerjee, Maoist leader Kishenji, Belpahari ,India ,West Bengal ,crime, law and justice ,terrorism (crime) ,politics

Trinamool Congress MP and West Bengal Chief Minister's nephew Abhishek Banerjee sparked off a controversy on Friday after he said that the Mamata Banerjee government killed Maoist leader Mallajula Koteswar Rao aka Kishenji

అభిషేక్ వ్యాఖ్యలతో ఇబ్బుందులు పడుతున్న మమత సర్కార్

Posted: 07/18/2015 10:05 PM IST
Mamata govt killed kishenji says tmc mp abhishek banerjee

మమత బెనర్జీ సర్కార్ ను అమె మేనల్లుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇబ్బందుల పాలు చేసేందుకు చూస్తున్నారా..? అంటే అలానే వున్నాయి పరిస్థితులు. ఇటీవల విఫక్షాలపై కారాలు, మిరియాలు నూరి, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసుతో ఇబ్బందులను ఎదుర్కోంటున్న అభిషేక్ బెనర్జీ.. మరోమారు రమారమి అలాంటి వ్యాఖ్యలే చేశారు. మావోయిస్టు అగ్రనేత కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీని తమ ప్రభుత్వమే చంపేసిందని అభిషేక్ బెనర్జీ అంగీకరించారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా బెల్పహారిలో జరిగిన బహిరంగసభలో అభిషేక్ బెనర్జీ ఈ విషయాన్ని సభ సాక్షిగా ఒప్పకున్నాడు.

బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కిషన్‌జీని చంపడం ద్వారా తమ తృణమూల్ సర్కారు ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేసిందన్నారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలతో మమతాబెనర్జీ చిక్కుల్లో పడ్డారు. గతంలో ఆమె కిషన్‌జీ మరణానికి, ప్రభుత్వానికి ఏ సంబంధమూ లేదని చెప్పారు. ఇప్పుడు అభిషేక్ బెనర్జీ వాస్తవాన్ని బయటపెట్టడంతో మమతాబెనర్జీకి ఛుక్కలు కనపడుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ 2011 నవంబర్‌లో పశ్చిమ మిడ్నాపూర్‌లోని బురిసోల్ అనే గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని ప్రభుత్వం ఇంతకాలం వాదించింది. బెనర్జీ తాజా వ్యాఖ్యలతో అది అబద్ధమని తేలిపోయింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kishenji  Maoists  Trinamool Congress (TMC)  Mamata Banerjee  Abhishek Banerjee  West Bengal  

Other Articles