Godavari pushkaralu | Telangana | KCR | Hyderabad | Traffic Jam

Telangana cm kcr review meeting on godavari pushkaralu in camp office

Godavari pushkaralu, Telangana, KCR, Hyderabad, Traffic Jam

Telangana cm kcr Review meeting on Godavari pushkaralu in camp office. KCR order to officers and collectors to provide arrangements for Godavari pushkaralu.

ఏంటి లైన్ క్లీయర్ గా ఉందా..? అంతా ఓకేనా..? అంటున్న కేసీఆర్

Posted: 07/18/2015 01:06 PM IST
Telangana cm kcr review meeting on godavari pushkaralu in camp office

గోదావరి మహా పుష్కరాల సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన రహదారులు భక్తుల రద్దీతో నిండిపోయాయని, ట్రాఫిక్ ను యుద్ద ప్రాతిపదికన క్రమబద్దీకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పుష్కరాలు జరుగుతున్న ఏర్పాట్లను, ట్రాఫిక్ పరిస్థితిని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిరాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మతో మాట్లాడారు. శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో భక్తులు పుష్కర స్నానాలు చేయడానికి పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. గోదావరి ప్రవహించే ఐదు జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల్లోని రహదారులపై కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.

Also Read:  కేసీఆర్ పుష్కరస్నానంపై రేవంత్ ఘాటు విమర్శ

ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమయితే హైదరాబాద్ నుంచి పోలీస్ సిబ్బందిని ప్రధాన రహదారులకు పంపాలని చెప్పారు. టోల్ గేట్ల వద్ద ఎక్కువ సేపు ఆగాల్సి వస్తుందని, అక్కడ పనిని వేగవంత చేయాలని సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే రహదారుల నుంచి ట్రాఫిక్ ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించే అవకాశాలను పరిశీలించాలన్నారు. మార్గ మధ్యలో సాంకేతిక కారణాల వల్ల ఆగీపోయిన వాహనాలను తొలగించడానికి క్రేన్లు వాడాలని చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. భక్తులు పెద్ద ఎత్తున నదీ వద్దకు చేరుకుంటున్నారని, అంతా ఒకేసారి నదిలోకి దిగే ప్రయత్నం చేస్తే తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది కాబట్టి, అక్కడ భక్తుల స్నానాలను క్రమపద్దతిలో నిర్వహించాలని చెప్పారు.

Also Read:  తెలంగాణ గోదావరి పుష్కరాలకు నీటి కటకట

 పుష్కర ఘాట్ల వద్ద 24 గంటల పాటు ఈతగాళ్లు, పడవలు అందుబాటులో ఉండాలని చెప్పారు. లోతైన ప్రాంతాలకు భక్తులు వెళ్లకుండా చూడాలని చెప్పారు. ఆలయాల వద్ద కూడా క్యూలైన్ల నిర్వహణ సరిగా ఉండాలన్నారు. మహిళలు, పిల్లలు, వృద్దులు, వికలాంగుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, వారికి అవసరమైన సహాయం అందించాలన్నారు. మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా నిరంతరం ఉండేట్లు చూడాలన్నారు. ఆయా పుష్కర ఘాట్లకు ఇంచార్జులుగా ఉన్న ఐఎఎస్ అధికారులు, మంత్రులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఇతర సిఎంఒ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

By Abhinavachary

Also Read:  తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త. కట్టుదిట్టమైన ఏర్పాట్లు
Also Read:  ఏపిలో ఎత్తేశారు.. కానీ తెలంగాణలో మాత్రం బాదుతున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godavari pushkaralu  Telangana  KCR  Hyderabad  Traffic Jam  

Other Articles