Yasin Bhathkal | Jail | Escape | Alert | NIA | Charlapalli Jail

Terrorist yasin bhathkal trying to escape from charlapalli jail

Yasin Bhathkal, Jail, Escape, Alert, NIA, Charlapalli Jail

Terrorist Yasin Bhathkal trying to escape from Charlapalli jail. NIA alert the Central and state govt on Yasin Bhathkal escape. NIA record the phone conversation of Bhathkal.

యాసిన్ భత్కల్ పరారీకి కుట్ర

Posted: 07/04/2015 09:46 AM IST
Terrorist yasin bhathkal trying to escape from charlapalli jail

ఉగ్రవాది యాసిన్ భత్కల్ పరారీకి అంతా సిద్దమైందా..? జైలు గోడలు బద్దలు కొట్టుకొని మరీ భత్కల్ పారిపోతారా..? తిరిగి బయటకు వెళ్లి భార్య, స్నేహితులను కలవనున్నాడా..? ఇలా అనేక ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. కిరాతక ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఫోన్ ను రికార్డ్ చేసిన ఎన్ఐఎ ఈ విషయాలను గుర్తించింది. దేశ భద్రతా వ్యవస్థను అలర్ట్ చేసింది. యాసిన్ భత్కల్ తన భార్యతో మాట్లాడిన సంభాషణను రికార్డు చేసిన ఎన్ఐఎ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. చర్లపల్లి వల్ల భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. త్వరలోనే జైలు గోడలు బద్దలు కొట్టుకుని వస్తాను అని భార్యతో అన్న భత్కల్ ఉగ్రవాది తన మొబైల్ నుండే ఫోన్ మాట్లాడటంపై అనుమానాలు. అయితే తన మిత్రులకు కూడా ఫోన్ చేసిన భత్కల్. త్వరలోనే కలుసుకుందామని పందేశం. అయితే ఉగ్రవాది తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంపై ఎన్ఐఎ అప్రమత్తమైంది. కాగా అసలు భత్కల్ నిజంగా పారిపోవడానకే ప్రయత్నిస్తున్నారా..? లేదా వేరే ప్లాన్ వేస్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు బృందాలు దృష్టిసారించాయి. తన బార్యతో పాటుగా మిగిలిన వారిని కలుసుకుంటానని ఎలా అనగలిగారు..? అలాగే తన ఫోన్ ట్యాప్ చేస్తారు అని తెలిసి కూడా భత్కల్ అంత దైర్యంగా ఎలా మాట్లాడారు అని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

Also Read:  దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల యాసిన్ భత్కల్ అరెస్టు..

దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ ను గతంలో ఎన్ఐఎ అధికారులే అరెస్టు చేశారు. నేపాల్ లో ఎన్ఐఎ అధికారులు యాసిన్ భత్కల్ ను అదుపులోకి తీసుకున్నారు. జంట బాంబు పేలుళ్లలో సిసి కెమెరాలో ఫుటేజ్ ఆధారంగా ఎన్ఐఎ అధికారులు భత్కల్ ను గుర్తించారు. 30 సంవత్సరాల యాసిన్ భత్కల్ ఇండియన్ ముజాహుద్దీన్ వ్యవస్థాపకుడు. ఇతను కర్ణాటక ప్రాంతానికి చెందిన వాడు. 2010 పుణెలో జర్మన్ బేకరి పేలుళ్ల కోసులోనూ ఇతనే ప్రధాన నిందితుడు. ఈ పేలుళ్లలో 17 మంది మృతి చెందారు. అదే సంవత్సరం బెంగుళూరులోని చిన్న స్వామి స్టేడియం బయట కూడా బాంబు పేలుళ్లు జరిపాడు. 2013 ఫిబ్రవరిలో దిల్ సుఖ్ నగర్ లో జంట బాంబు పేలుళ్లకు కూడా యాసిన్ భత్కలే కారణం. అయితే ఇలా ఓ ఉగ్రవాది తాను త్వరలోనే జైలు నుండి తప్పించుకుని వస్తానని చెప్పడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yasin Bhathkal  Jail  Escape  Alert  NIA  Charlapalli Jail  

Other Articles