Aviation | Modi | middle class | policy | NDA

New aviation policy will allow middle class families at least yearly flights

Aviation, Modi, middle class, policy, NDA

The government has decided to rework the proposals outlined in the draft aviation policy to achieve the twin objective of reducing the airline operation costs and providing greater accessibility to the travelling public. The stated objective of the policy, a senior government official said, would be to ensure that every middle class family can travel by flight at least once every year.

మధ్యతరగతి వారికి విమానయానం.. మోదీ ప్లాన్

Posted: 07/16/2015 03:28 PM IST
New aviation policy will allow middle class families at least yearly flights

అచ్చే దిన్ అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన మోదీ.. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు ఎంతో మేలు చేసే పథకాలను ప్రారంభించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్ ధన్, అటల్ పెన్షన్ యోజన లాంటివి సామాన్య జనానికి ఎంతో మేలుచేసేవే. అందరికి భీమా కల్పించాలనే లక్ష్యంతొ నరేంద్ర మోదీ ప్రారంభించిన జన్ ధన్ పథకం గురించి అయితే సర్వత్రా హర్షంవ్యక్తమయింది. తాజాగా ఆ దిశగానే మరో పథకానికి మోదీ సిద్దపడుతున్నారని సమాచాంరం. అయితే ఆ పథకం ఎలా ఉంటుంది..? అంటే మామూలు వ్యక్తులు కూడా విమాన ప్రయాణం చేసేలాగా ప్రభుత్వం అన్ని అవకాశాలను కల్పించేలా ఉంటుంది. ఏంటి మామూలు వ్యక్తులకు విమాన ప్రయాణ:, అది కూడా ప్రభుత్వమే స్వయంగా సపోర్ట్ చేస్తుందా..? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మొత్తం ఆర్టికల్ చదవాల్సిందే.

నరేంద్ర మోదీ.. భారత రాజకీయాల్లో ఓ కొత్త కిరణం.. భారత కీర్తిని విశ్వవ్యాప్తం చేసి, సగటు భారతీయుడి గుర్తింపును అన్ని దేశాలకు ఇనుమడింపజేసిన భారత ప్రధాని. గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ది వైపు పరుగులు పెట్టించిన నరేంద్ర మోదీ సగటు జనానికి మేలు చేసే అన్ని రకాల అవకాశాలను అందుకుంటున్నారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలతో ప్రజలకు సేవలనుయ అందించడంతో పాటుగా వారికి ఉపాధిని కూడా అందించడానికి పూనుకున్నారు. అయితే మామూలు వ్యక్తులకు విమాన ప్రయాణం అంటే అందని ద్రాక్షలాంటిదే. ఆకాశంలో విమానం ఎగురుతుంటే నేల మీద కూర్చొని సంబరపడే ఎంతో మంది మిడిల్ క్లాస్ జనాలకు మోదీ ఓ శుభవార్తనే చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. అందరికి విమానయానం కల్పించేందుకు మోదీ ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు సమాచారం. కొత్తగా తేనున్న పౌరవిమానయాన విధానంలో ప్రతి మధ్య తరగతి కుటుంబం సంవత్సరానికి ఒకసారి విమాన ప్రయాణం చేసేలాగా అవకాశం కల్పించేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. అదే గనక జరిగితే నేల మీద నుండి సంబరపడ్డ జనం.. నిజ జీవితంలో విమానయానాన్ని ఆస్వాదిస్తారు.

మోదీ ఆలోచన ఎలా ఉన్నా.. దీని మీద అప్పుడే ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాలే కడుపులతో పడుకునే ఎంతో మందికి కనీసం ఉపాథి, ఆహారాన్ని అందించలేని మోదీ సర్కార్ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా విమానయానం పేరుతో మోసం చేస్తోందని మండిపడుతున్నారు. అరచేతిలో విశ్వాన్ని చూపించడం మోదీ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని వారు విమర్శిస్తున్నారు. భారతదేశంలో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతున్నా కానీ పేదల సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలె తగ్గడం లేదు. ఇప్పటికే సగటు పేదవాడి జీవన ప్రమాణం 21 రూపాయలతో నడుస్తోంది అంటే భారత్ లో ఎంత దారుణంగా ఉందో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఆసియా దేశాల్లోనే ఎక్కువ మంది పేదలు ఉన్నారు. అందునా భారత్ లో పేదల సంఖ్య తక్కువేమీ కాదు. మరి పేదలకు కడుపు నిండా తిండి పెట్టడానికి ఆలోచించని మోదీ సర్కార్ విమానయానం మీద మాత్రం బాగా దృష్టిసారించిందని విమర్శకులు మండిపడుతున్నారు.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aviation  Modi  middle class  policy  NDA  

Other Articles