jupally krishna rao takes on telangana tdp leaders

Jupally krishna rao fires on telangana tdp leaders

jupally krishna rao takes on telangana tdp leaders, Minister Jupally Krishna rao, fire, Telangana TDP leaders , Palamuru Lift Irrigation, Ravula chandrashekar reddy, chandrababu naidu, mahaboob nagar, district development,

jupally krishna rao takes on telangana tdp leaders, says they don't have any proofs stating that development in mahaboobnagar done by chandrababu

దమ్ముంటే.. రండీ.. ఆధారాలు తీసుకురండి.. ప్రెస్ క్లబ్ రిజర్వు చేశా

Posted: 07/15/2015 09:48 PM IST
Jupally krishna rao fires on telangana tdp leaders

పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులపై టీడీపీ నేతలకు తాను విసిరిన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణా రావు పునరుద్ఘాటించారు. ఈమేరకు మరోసారి టీడీపీ నేతలకు బహిరంగ లేఖ రాశారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై సవాల్‌కు కట్టుబడి ఉన్నానని, దీనిపై చర్చించేందుకు గురువారం ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు తాను వస్తానని, పూర్తి ఆధారాలతో మీరూ రావాలని లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ ఈ వేదిక ఆమోదయోగ్యం కాకుంటే మీరు చెప్పిన చోటుకే వస్తానని అన్నారు. చర్చకు నిజనిర్థారణ కర్తలుగా వ్యవహరించడానికి జర్నలిస్టు యూనియన్ నేతలు అంగీకరించారని మంత్రి జూపల్లి తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ టీడీపీ నేతలకు పాలమూరు ప్రాజెక్టులపై చర్చించే దమ్ము లేదని జూపల్లి ధ్వజమెత్తారు. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డితో బహిరంగ చర్చ జరిపేందుకు జూపల్లి అసెంబ్లీ కమిటీ హాల్‌కు ఈ ఉదయం 10.30 గంటల సమయంలో వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూశారు. రావుల రాకపోయే సరికి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ టీడీపీ నేతలు మాటలకే పరిమితమయ్యారు అని మండిపడ్డారు. మాటలు పక్కన పెట్టి చర్చకు వస్తే నిజాలు ఏంటో తెలుస్తాయన్నారు. అసెంబ్లీ కమిటీ హాలుకు రాలేము అనుకుంటే మీరే హైదరాబాద్ నగరంలోని ఏదైనా ఫంక్షన్ హాలులో చర్చ పెట్టండి. నేనే అక్కడికి వస్తా. అవసరమైతే ఫంక్షన్ హాలు కిరాయి కూడా తానే భరిస్తానన్నారు.

మాజీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీల్లోకి రావొచ్చు. ఏదో సాకు చెబుతూ తప్పించుకు తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. వారికి చర్చకు దమ్ము లేకుంటే.. మీ చంద్రబాబుతో ఒక లేఖ రాయించండి. పాలమూరు ఎత్తిపోతల విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రానికి, సీడబ్ల్యూసీకి లేఖ రాయించండి అని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో రూ. 7,800 కోట్లు కేటాయించి రూ. 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టులను ఆపాలని బాబు లేఖ రాశారని నిరూపిస్తానన్నారు. ఇప్పటికీ తన మాటకు కట్టుబడి ఉన్నానని జూపల్లి పునరుద్ఘాటించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles