acb quizzed hours together vem narender reddy son krishna kirthan

Telangana acb questions vem narender reddy s son

cash for vote, krishna keerthan reddy, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, Telangana acb, vem narender reddy, horse riding

Telangana ACB officials questioned Telugu Desam party leader Vem Narender Reddy's son Krishna Keerthan Reddy in cash for vote case.

వేం కుమారుడి కృష్ణకీర్తన్ పై ప్రశ్నల వర్షం కురిపించిన ఏసిబి

Posted: 07/15/2015 08:31 PM IST
Telangana acb questions vem narender reddy s son

ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ఎనిమిదిన్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం.. ఏబీసీ అధికారులు కీర్తన్ రెడ్డికి నోటీసులు జారీచేయడంతో ఆయన ఇవాళ  ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి సుదీర్ఘ విచారణలో ఏసీబీ అధికారులు కీర్తన్ రెడ్డిని పలు అంశాలపై ప్రశ్నిస్తున్నారు. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎక్కడినుంచి వచ్చాయనే దానిపై అధికారులు కీర్తన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఎవరెవరితో ఏం మాట్లాడారు, ఎంతమేర ఒప్పందాలు కుదిరాయనే దానిపై ఏసీబీ అధికారులు కీర్తన్ నుంచి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో కృష్ణ కీర్తన్ రెడ్డిని సాక్షిగానే విచారించామని ఎసిబి అధికారులు చెప్పారు. కాగా, వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించడానికి టిడిపి శాసనసభ్యులు ఇతర పార్టీల శాసనసభ్యులను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారనే అంశానికి సంబంధించి కృష్ణకీర్తన్ ను అధికారులు సుదీర్ఘంగా విచారించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cash for vote  Telangana ACB  krishna keerthan reddy  

Other Articles