MIM | TRS | Alliance | Hyderabad | Elections | TDP | Congress, BJP

Mim party conformed that it will contest lonely

MIM, TRS, Alliance, Hyderabad, Elections, TDP, Congress, BJP

MIM Party conformed that it will contest lonely. TRS party hope the alliance with the TRS Party. MIM Party hope to get more seats in the Greater Hyderabad elections.

పొత్తులేదంటున్న మజ్లిస్.. అంతర్మథనంలో టిఆర్ఎస్

Posted: 07/15/2015 03:53 PM IST
Mim party conformed that it will contest lonely

హైదరాబాద్.. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ చూసినా దీని మీదే చర్చించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ లో ఎలాగైనా తమ పార్టీ .జెండానే ఎగరవెయ్యాలని అన్ని పార్టీలు తహతహలాడుతున్నాయి. అందుకే అన్ని పార్టీల టార్గెట్‌. సిటీ జనాన్ని ప్రసన్నం చేసుకొని గ్రేటర్ పీఠం దక్కించుకోవడానికే ఇపుడు పొలిటికల్‌ పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నాయి. ఏ క్షణాన నోటిఫికేషన్ వచ్చినా సై అంటున్నాయి. గతంలో జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పోటీ చేశాయి. బిజేపి, టిడిపిలతో పాటు మిగతా పార్టీలన్నీ పొత్తుల్లేకుండానే తలపడ్డాయి. కాంగ్రెస్ ఎంఐఎం కూటమే గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే ఎప్పుడూ అధికార పార్టీతో కలిసి గ్రేటర్‌ పోటీలో దిగే.. ఎంఐఎం.. ఈసారి ఒంటరి పోరాటం చేసేందుకు సిద్ధమయ్యింది. ఒంటరిగానే పోటీ చేస్తామని మజ్లిస్‌ ప్రకటించడంతో ఇప్పుడు గులాబీ దళానికి వేరే ఆప్షన్‌ లేకుండాపోయింది.

Also Read:  జీహెచ్ఎంసీ ఎన్నికలను సా..గదీస్తారా?

గ్రేటర్ హైదరాబాద్‌లో డీ లిమిటేషన్ జరగలేదు. రిజర్వేషన్లు ఖరారు కాలేదు. అసలు గ్రేటర్‌గా ఉంటుందా, నగరాన్ని మూడు విభాగాలు చేస్తారా.. అన్నదానిపై ఇంకా చర్చ జరగుతోంది. అయితే ఏం జరిగినా.. గ్రేటర్‌ పీఠాన్ని దక్కించుకోవాలని పార్టీలు ప్రిపేర్‌ అవుతున్నాయి. మజ్లిస్‌ మాత్రం ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు సాధించాలని ప్లాన్‌ చేస్తోంది. ఇటు అధికార టీఆర్‌ఎస్‌.. స్వచ్ఛ హైదరాబాద్, డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్లు, పేదల భూపట్టాల క్రమబద్దీకరణ.. మురికివాడల ఆధునీకరణ, రహదారుల మరమ్మత్తు అంశాలతో జనంలోకి వెళ్తోంది.

Also Read:  GHMC ఎన్నికల నిర్వహణపై టీ-సర్కారుకు షాకిచ్చిన హైకోర్టు

హైదరాబాద్‌లో మరో బలమైన పార్టీ బిజేపి. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడిపితో పొత్తు పెట్టుకుంది కమలం పార్టీ. ఇపుడు గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆ మైత్రి కొనసాగనుంది. అయితే, ఎంఐఎం ఒంటరి పోరు విషయంలో అనుమానాలు వ్యక్థం చేస్తున్నాయి రాజకీయ వర్గాలు. పైకి పొత్తూగిత్తూ లేదంటున్నా కానీ చివరకు ఓ అవగాహనకు వచ్చే ఛాన్స్‌ లేకపోలేదని అంతా గుసగుసలాడుకుంటున్నారు. అన్ని పార్టీలు ఎవరికివారే అన్న తరహాలో పోటీకి సిద్ధమవుతుండటంతో ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. మరి హైదరాబాద్ కా బాద్ షాగా ఏ పార్టీ నిలుస్తుందో చూడాలి.

By Abhinavachary

Also Read:  కేసీఆర్ నోట.. హైదరాబాద్ మాట ఇంతలా ఎందుకంటే.. ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MIM  TRS  Alliance  Hyderabad  Elections  TDP  Congress  BJP  

Other Articles