Ravula | Jupalli | TDP | TRS | Mahabubnagar | Palamur | Palamur lift irrigation, Chandrababu

War of words beteen ravula and jupalli is going on

Ravula, Jupalli, TDP, TRS, Mahabubnagar, Palamur, Palamur lift irrigation, Chandrababu

War of words beteen Ravula and Jupalli is going on. Jupalli challenge the TDP party on Palamur projects in the chandrababu perod.

సాగుతున్న రావుల, జూపల్లి జగడం

Posted: 07/15/2015 03:22 PM IST
War of words beteen ravula and jupalli is going on

పాలమూరు ఎత్తిపోతల పథకాల మీద, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పాలమూరు ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన నిధుల మీద వివాదం రాజుకుంది. చంద్రబాబు నాయుడు పాలమూరుకు చేసిందేమీ లేదని జూసల్లి కృష్ణారావ్ మండిపడ్డారు. అయితే పాలమూరుకు సాగునీటిని అందించడంలో చంద్రబాబు నాయుడు ఎంతో కీలకంగా వ్యవహరించారని, తెలుగుదేశం పార్టీ హయంలోనే పాలమూరుకు మహర్దశ పట్టిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖర్ రావ్ వివరించారు. అయితే చంద్రబాబు హయంలో జరిగిన అన్న అంశాల మీద చర్చించడానికి తాను సిద్దంగా ఉన్నానని, అసెంబ్లీ హాల్ లో చర్చించడానికి రావాలని జూపల్లి సవాల్ విసిరారు. అయితే రావుల మాత్రం చర్చకు సిద్దంకాలేదు.

Also Read:  సవాల్ కు సిద్దమా..? ముక్కు నేలకు రాస్తారా..? జూపల్లి

పాలమూరు జిల్లా కోసం చంద్రబాబు నాయుడు, అతని ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల మీద, మిగిలిన అంశాల మీద చర్చకు జూపల్లి అసెంబ్లీ హాల్ కు చేరుకున్నా రావుల మాత్రం రాలేదు. అయితే రావుల చంద్రశేఖర్ రాకపోవడంపై జూపల్లి కృఫ్ణారావ్ స్పందించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తోకముడుచుకున్నారని అన్నారు. అయితే రావుల అసెంబ్లీ హాల్ కు రాలేకపోతే ఎక్కడైనా చర్చించడానికి తాను సిద్దంగా ఉన్నానని అన్నారు. ఏ ఫంక్షన్ హాల్ లో అయినా తాను చర్చించడానికి సిద్దంగా ఉన్నానని.. ఆ ఖర్చును కూడాతాను భరించడానికి తాను సిద్దంగా ఉన్నానని జూపల్లి వెల్లడించారు. జూపల్లి సవాల్ మీద రావుల మరోసారి స్పందించారు. జూపల్లి ఏకపక్షంగా వేదికను నిర్ణయంచడం ఏంటని..? చర్చకు తాము సిద్దంగానే ఉన్నామని అప్పుడు ఎంత మందితో వచ్చినా కానీ తాను చర్చించడానికి సిద్దంగా ఉన్నానని రావుల వెల్లడించారు. మొత్తానికి పాలమూరు ప్రాజెక్టుల మీద ప్రారంభమైన వివాదం ఇంకా సాగుతూనే ఉంది. మరి మొత్తానికి చర్చించడానికి రావుల, జూపల్లి ఇద్దరూ ఒకే వేదిక దగ్గరకు చేరతారో లేదా మాటల వరకే వదిలేస్తారో చూడాలి.

Also Read: రావులా రావా..? ..జూపల్లి Vs రావుల

పాలమూరు ప్రాజెక్టు మీద ఇంతలా మొండిపట్టుపట్టడానికి వేరే కారణాలు ఉన్నాయని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.
* పాలమూరు జిల్లాలో ముందు నుండి తెలుగుదేశం పార్టీకి గట్టి ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి తెరాస ప్రభుత్వం పాలమూరు మీద ఎక్కువగా దృష్టిసారించింది.
* రేవంత్ రెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి లాంటి వాళ్లు పాలమూరు నుండే ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
* మిగిలిన తెలంగాణ జిల్లాల్లో కన్నా పాలమూరులో టిఆర్ఎస్ కు ఓటు బ్యాంక్ పదిలంగా లేదు.

By Abhinavachary

Also Read:  పాలమూరులో నాయకుల పచ్చిబూతులు? పారిపోయిన జనం ?
Also Read:  టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే: జూపల్లి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravula  Jupalli  TDP  TRS  Mahabubnagar  Palamur  Palamur lift irrigation  Chandrababu  

Other Articles