Rajahmundry | Pushkar | Godavari pushkar | Chandrababu

Tragedy at rajamundry pushkar ghat by the govt negligence

Rajahmundry, Pushkar, Godavari pushkar, Chandrababu

Tragedy at Rajamundry Pushkar Ghat by the govt negligence. Govt and the alloted offcers didnt arrange the full facilities at the Rajamundry pushkars.

ప్రభుత్వ నిర్లక్షం, అధికారుల అలసత్వం.. బలైంది భక్తులు

Posted: 07/14/2015 06:35 PM IST
Tragedy at rajamundry pushkar ghat by the govt negligence

గోదావరి మహా పుష్కరాలు ఉన్నాయన్న సంగతి అటు అధికారులకు ఇటు ప్రభుత్వానికి తెలుసు. కానీ నిర్లక్ష్యం. గత కొన్ని నెలలుగా పుష్కర పనుల తీరుపై మీడియా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. పుష్కర పనులు సాగటం లేదని, జరిగిన పనుల్లోనూ నాణ్యత లేదని, అధికారులు పట్టించుకోవడం లేదని, నిధులు లేవని ఇలా ప్రతీ విషయాన్ని మీడియా హైలైట్ చేస్తూ వచ్చింది. కానీ ఏం జరిగింది. చివరకు ప్రాణాలు పోయి విషాదంతంతో పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మరికొద్ది రోజుల్లో పుష్కరాలు ప్రారంభమవుతాయనగా స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రిలో అధికారులతో పుష్కరపనులు చూస్తున్న యంత్రాంగంతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించారు కూడా. పనుల తీరుపై అసంతృప్తి వ్యకం చేశారు కూడా. కానీ ఏమైంది చివరకు పుణ్యం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

మంత్రి నారాయణ స్వయంగా పుష్కరపనులను చూశారు. రాజమండ్రి నగరంతో పాటు ఘాట్ల పరిశీలన చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పక్కా ఏర్పాట్లు చేశామని స్టేట్ మెంట్లు ఇచ్చారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. తీరా చూస్తే తొలి రోజే మంచి నీరు తాగుదామంటే ఎక్కడా తాగునీటి సౌకర్యమే లేదు. మండే ఎండలు ఓవైపు… వెల్లువల్లా వచ్చిన భక్తుల రద్దీ మరోవైపు .. ఉక్కిరిబిక్కిరి అయిన ప్రాణాలు ఊపిరి పోగొట్టుకున్నాయి. తోపులాట, గందరగోళం.. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ప్రాణాలు పోయాయి. వేలల్లో జనం ఎటుచూసినా పుష్కరఘాట్ల దగ్గర వెల్లువల్లా చేరుకున్నారు. ఊహించనివిధంగా వచ్చిన భక్తుల రద్దీని అధికారులు అంచనా వేయలేకపోయారు. ఏం చేయలేక చేతులెత్తేశారు. ఫలితంగా మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వచ్చింది. మరోవైపు వీఐపీలు కూడా ఎక్కువగా వచ్చారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కామినేని, మాణిక్యాల రావు, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి ఇలా అందరూ పుష్కరాలకు తరలిరావడంతో పోలీస్ యంత్రాంగం, పుష్కర పనుల అధికారులు వారి సేవలో తరించారు. సామాన్యులను పట్టించుకునే వాడు లేకపోవడంతో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajahmundry  Pushkar  Godavari pushkar  Chandrababu  

Other Articles