chiru hits out at TDP government on pushkaram arrangements

Mp chiranjeevi lashes out ap government

MP chiranjeevi lashes out AP government, chiranjeevi, congress, godavari pushkaram, rajamundry, stampede, kamineni srinivas, pilgrimage, rajamundry government hospital, temple, rajamundry pushkara ghat, deceased families, opposition parties, Andhra Pradesh, AP stampede, Chandrababu Naidu, Godavari Pushakaram, pilgrims, pushkaralu ghat, Rajahmundry, Stampede

Hitting out at the AP government, Chiranjeevi alleged that Chief Minister Chandrababu Naidu claimed to have made grand arrangements, but it all came to naught.

పుష్కరాల్లో తొక్కిసలాట.. మరణాలు.. ప్రభుత్వ వైఫల్యమే

Posted: 07/14/2015 04:47 PM IST
Mp chiranjeevi lashes out ap government

రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మరణించిన ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని కాంగ్రెస్‌ నేత చిరంజీవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఘటనపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాటలో 27 మంది మృతిచెందడం దిగ్ర్భాంతికి గురిచేందన్నారు. మీడియాలో తొక్కిసలాట దృశ్యాలు చూస్తుంటే గుండెతరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి ఇచ్చిన ప్రాధాన్యత.. ఏర్పట్లు చేయడంలో తీసుకోలేదని విమర్శించారు.

పుష్కరాలకు ఎంతమంది వస్తారనేది అంచనా వేయలేకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని చంద్రబాబు చెప్పడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. పుష్కరాలకు అన్ని తానై ఉన్న చంద్రబాబు నాయుడు తొక్కిసలాట ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గతంలో కృష్ణా పుష్కరాల సమయంలో ఇద్దరు ముగ్గురు చనిపోతే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నానాయాగీ చేశారని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన ఇప్పుడు అదే నైతిక బాధ్యత వహించి..చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
 
పుష్కరాల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. పుష్కరాలకు భారీ ఎత్తున్న ప్రచారం చేసిన లక్షాలాధి మంది వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం అందుకు తగ్గస్తాయిలో ఏర్పాట్లు చేయలేకపోయిందని విమర్శించారు. వందల కోట్లను ఖర్చు చేసినా.. పూర్తి స్థాయిలో ఏర్పాటు జరగకపోవడం ప్రభుత్వం వైఫల్యం కాకమరోటి కాదన్నారు. స్వయంగా చంద్రబాబు పుష్కర పనులను పర్యవేక్షించినా.. ఇలాంటి అపశృతులు చోటుచేసుకోవడంపై ప్రభుత్వాన్ని నిందించారు. తనను తాను గొప్ప అడ్మినిష్ట్రేటర్ గా చెప్పుకునే చంద్రబాబు, ఘాట్ లలో ఎంతమంది వస్తున్నారు. ఎంత మంది బయటకు వెళ్తున్నారన్న విషయాలను కూడా సరిగా అంచనా వేయలేకపోయారని ఆయన తూర్పారబట్టారు.

మహాకుంభమేళాకు గోదావరి పుష్కరాల కంటే పలు రెట్లు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారని అయినా ఎక్కడా ఎలాంటి అపశృతులు జరగవని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా పలు మీడియా సంస్థలను కూడా ఆయన చురకలు అంటించారు. కొంతమంది మీడియా వ్యక్తులు చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారని, ఇలాంటి ఘోరాలు కూడా వారికి పట్టవా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు తాను రాజమండ్రికి బయలుదేరి పుష్కరాల ఏర్పట్లలో ఎలాంటి లోపాలున్నాయనేది పరిశీలించుకుంటామని చిరంజీవి చెప్పారు. పుష్కర తోక్కిసలాటకు కారణాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకుంటామని చెప్పారు. మృతుల కుటుంబాలను పరామర్శించి. వారికి న్యాయజరిగేలా చూస్తామని చిరంజీవి చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : godavari pushkaram  rajamundry  stampede  kamineni srinivas  pilgrimage  

Other Articles