Gadavari pushkaralu | Politics | Chandrababu naidu | Rajahmundry

Politics at the death of piligrims of rajahmundry puskaralu

Gadavari pushkaralu, Politics, Chandrababu naidu, Rajahmundry

politics at the death of piligrims of Rajahmundry puskaralu. Political leaders attacked on govt for the incident at Godavari Pushkaralu.

చావు రాజకీయాలు అంటే ఇవే..!

Posted: 07/14/2015 06:34 PM IST
Politics at the death of piligrims of rajahmundry puskaralu

కవిత్వానికి కాదేదీ అనర్హం అన్నట్లు రాజకీయాలకు కూడా ఏదీ అతీతం కాదు. రాజకీయ నాయకుల మాట్లాడటానికి, వాదులాడటానికి ఏదైనా కూడా ఆయుదమే. తాజాగా రాజమండ్రిలో పుష్కరఘాట్ వద్ద 30 మంది చనిపోయి, 15 మంది గాయపడగా.. రాజకీయ నాయకులు మాత్ర ప్రభుత్వం మీద, మంత్రుల మీద, చంద్రబాబు నాయుడు మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మీడియా సమావేశం ఏర్పటు చేసి మరీ బూతులు తిడుతున్నారు. జనం చచ్చిపోతే.. రాజకీయాలు మాట్లాడుతున్నారు. బాధ్యతవహించాలని ఒకరు.. రాజీనామా చెయ్యాలని ఒకరు ఇలా రకరకాలుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయినా ఘటన మీద సంతాపం వ్యక్తం చెయ్యడం.. సానుభూతి ప్రకటించడం.. వీలైతే పార్టీ తరఫున ఎక్స్ గ్రేషియా ప్రకటించడం లాంటివి చేస్తున్నారు.

మన ఇంట్లొ చేసే చిన్న చిన్న ఫంక్షన్ లలోనే తప్పులు జరుగుతుంటాయి. కొన్ని లక్షల మంది వచ్చే పుష్కరాల్లాంటి వాటి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగని జరిగిన తప్పును వెనకేసుకురావడం లేదు. తప్పు జరిగిపోయింది.. దాని మీద విచారం వ్యక్తం చెయ్యడం.. విచారణ చేయించడం తర్వాత స్టెప్. కానీ రాజకీయ నాయకులు బాధ్యతగా వ్యవహరిస్తే పరిస్థితి మరోలా ఉంటుంది అన్నది చాలా మంది భావన. వీలైతే పవన్ లాగా పార్టీ కార్యకర్తలకు అక్కడి వారికి సహాయం చెయ్యాలని అని పిలుపునివ్వాలి. ఓ మామూలు వ్యక్తిగా సహాయ కార్యక్రమాలు చేస్తే అది బాధ్యత అంటారు. అంతే కానీ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సిగ్గుచేటు. రాజకీయ నాయకులకు చెప్పేది ఒక్కటే.. అయ్యా  మీ విమర్శలు తర్వాత చెయ్యొచ్చు కానీ ముందు అక్కడి వారికి ఏదైనా సహాయం చెయ్యండి లేదంటే ఊరికే కూర్చండి అంతే తప్ప మీడియాలో వార్తల కోసం నొటికి ఏది వస్తే అది మాట్లాడకండి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gadavari pushkaralu  Politics  Chandrababu naidu  Rajahmundry  

Other Articles