aware doctors released pratyusha health bulletin

Stepmom dad brutally tortured pratyusha just for a flat

Stepmom, Dad Brutally Tortured Pratyusha Just for a Flat, aware doctors, pratyusha health bulletin, pratyusha, aware global hospital, heath bulletin, step mother, chamundeshwari, LB nagar police, human rights commision, severe punishment, Girl rescued, Child Rights Group, Child Rights Protection Commission, Child rauma, Torture, Telangana, Hyderabad

The father and stepmother of Pratyusha (19) had wanted to kill her slowly by torturing her to get hold of a flat that’s registered in her name.

రూ. కోటి విలువైన ఆస్తి కోసమే ప్రత్యూషపై చిత్రహింసలు..

Posted: 07/10/2015 10:33 PM IST
Stepmom dad brutally tortured pratyusha just for a flat

సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు లోనైన ప్రత్యూష గృహనిర్భంధం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కేవలం సవతి తల్లి అయినందునే అమెను చిత్రహింసలకు గురిచేశారన్న అరోపణలను పోలీసులు విచారించగా మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూశాయి. ప్రత్యూష పేరున ఉన్న ఆస్తిని చేజ్కించుకునేందుకు అమె సవతి తల్లి చాముండేశ్వరి, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి రమేష్ కలసి అమెను నెమ్మెదిగా చంపేదుకు పథకం రచించారని తెలిసింది. తమ చిత్రహింసతలో అమె మరణించిన తరువాత ఆస్తిని తాము అనుభవించేందుకుకే ప్రత్యూషను చిత్రహింసలు పెట్టారని పోలీసు విచారణలో నిందితురాలు చాముండేశ్వరి అంగీకరించినట్లు తెలిసింది.

2003లో రమేష్ కుమార్ మొదటి భార్య సరళాదేవి భర్తతో విడిపోయే సమయంలో పధ్మారావు నగర్ లో వున్న శ్రీరామ్ సీతమ్స్ అపార్టుమెంటులో ఉన్న ప్లాటును వారి కుమార్తె ప్రత్యూష పేరుపై రాయాలని ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు పెద్ల సమక్షంలో రాత పూతలు అన్ని జరిగాయి. ఆ తరువాత సరళాదేవి మృతిచెందింది. దీంతో ప్రత్యూషను బంధువులు సత్యసాయి ఆశ్రమంలో చేర్పించారు. 2013లో మైనారిటీ తీరిన ప్రత్యూషను తండ్రి రమేష్ కుమార్ బండ్లగూడ ఆనంద్ నగర్ లోని తన నివాసానికి తీసుకోచ్చాడు.

2013లో పద్మారావునగర్ లో ప్రత్యూష పేరున వున్న ప్లాట్ విలువ సుమారు కోటి రూపాయల ధర పలుకుతుండటంతో.. ఆ ఆస్తిని కాజేసేందుకు చాముండేశ్వరి, రమేష్ కుమార్ పథకం వేశారు. ఎలాంటి పరిస్థితుల్లో ప్రత్యూషకు ఫ్లాట్ దక్కకూడదని నిశ్చయించుకున్న వాళ్లు.. అమెను చిత్రహింసలకు గురిచేశారు. సుమారుగా ఏడాది పాటు గృహనిర్భందంలో వున్న వుంచి ఇంట్లో పనులన్ని చేయించారు. సమాయానికి కనీసం బోజనాన్ని కూడా పెట్టేవారు కాదని తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో పరారీలో వున్న ప్రత్యూష తండ్రి రమేష్ కుమార్ అరెస్టు అయితే గానీ పూర్తి వివరాలు తెలియవని పోలీసులు బావిస్తున్నారు.

కాగా, తన పేరున ఏయే ఆస్తులు వున్నాయో కూడా తనకు తెలియదని అంటోంది అవేర్ అసుపత్రిలో చికిత్స పోందుతున్న ప్రత్యూష. ఇవాళ తొలిసారగా తన కేసు వ్యవహరామై మీడియాతో మాట్లాడిన అమె, తన లాంటి పరిస్థితి మాత్రం ఏ ఆడపిల్లకు రాకూడదని కన్నీరుమున్నిరైంది. ఇంత ఘోరంగా వేదించిన తన నాన్నకు, పిన్నికి కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. సత్యసాయి ఆశ్రమం నుంచి వచ్చిన నాటి నుంచి తాను ప్రతిరోజు నరకాన్ని చూశానని చెప్పింది. ఏడాది కాలంగా గృహనిర్భందలో తనను హింసించిన ఘటనలను తలుచుకుని వెక్కివెక్కి ఏడుస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pratyusha  aware global hospital  heath bulletin  step mother  Flat  padmarao nagar  

Other Articles