Big people think petty: Dead child's dad hits back at Hema Malini

Outrage over hema malini blaming father of child killed in car accident

hema malini, hema malini accident, hema malini news, hema malini road accident, hema malini health, hema malini hospital, hema malini mercedes accident, hema malini news, Hema Malini accident, Rajasthan accident, Dausa accident, Mercedes, Maruti Alto, accident, actress, BJP MP, Bollywood, Jaipur, Mishap, Rajasthan, Actress, BJP MP, Mathura, Hema Malini, injured, car accident, Rajasthan, Dausa district, Jaipur.

Actor-turned-politician Hema Malini has provoked fresh outrage with tweets this morning blaming the father of the child who was killed in an accident last week in Rajasthan involving her Mercedes car.

ఎంపీ హెమామాలినిపై మరోమారు మండిపడ్డ నెట్ జనులు

Posted: 07/08/2015 11:15 PM IST
Outrage over hema malini blaming father of child killed in car accident

ప్రముఖ బాలీవుడ్ నటి, బాలీవుడ్ డ్రీమ్ గాల్ గా ఖ్యాతిగడించిన నటి, బీజేపి ఎంపీ హేమామాలినిపై మరోమారు నెట్ జనులు అక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. హేమామాలిని ఇటీవల రోడ్డ ప్రమాదానికి గురై కొలుకున్న తరువాత తొలిసారిగా చేసిన ట్విట్ అమెపై నెట్ జనులు అగ్రహానికి కారణమైంది. తన డ్రైవరును వెనకేసుకు వచ్చే క్రమంలో తప్పను అవతలి కారు డ్రైవర్ పై వేసే ప్రయత్నం చేస్తున్నారని ఇది ప్రజాప్రతినిధిగా, మీకు సమంజమేనా అని నెట్ జనులు ఘాటుగా నిలదీస్తున్నారు. కారు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మరణించడానికి అమె తండ్రే కారణమని ఇవాళ హేమా మాలిని ట్విట్ చేశారు.

హేమామాలిని ట్విట్ పై మండిపడ్డిన తండ్రి అమెపై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారం కిందట రాజస్థాన్ రాజధాని జైపూర్ కు 55 కిలోమీటర్ల దూరంలోని దౌసా వద్ద అమె వెళ్తున్న కారు అతివేగంగా వెగంగా దూసుకెళ్లి ఓ మారుతి అల్టోకారును ఢి కోనింది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి మరణించిన విషయం తెలిసిందే. పాప తల్లిదండ్రులతో పాటు సోదరులకు గాయాలయ్యాయి. వారింకా గాయాల నుంచి కూడా కోలుకోలేదు. ఇంకా ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న క్రమంలో.. స్వల్పంగా గాయాలపాలైన హేమామాలిని కొలుకుని తొలిసారిగా ఈ ఘటనపై ట్విట్ చేసింది.

పాప మరణానికి అమె తండ్రే కారణమని, అయన ట్రాఫిక్ రూల్స్ పాటించి వుంటే ప్రమాదం జరిగి వుండేది కాదని, ఆయన ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా కారును డ్రైవ్ చేసినందుకే.. పాప చనిపోయిందని ట్విట్ చేశారు. దీనిపై ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న పాప తండ్రి ఘాటుగా స్పందించారు. కారు ప్రమాదానికి తాను కారణమంటూ ఆరోపణలు చేయడంపై పాప మరణానికి తనను బాధ్యుడ్ని చేయడంపై మండిపడ్డారు. తన కారు ఇండికేటర్ అన్ లో వుందని, తాను కారును రోడ్డు క్లియర్ గా వున్నప్పుడు మలుపు తిప్పానని, చెప్పారు. ఇందులో తాను ఎక్కడ ట్రాఫిక్ రూల్స్ కు వ్యతిరేకంగా ఏం చేశానని హేమా మాలిని కనిపించిందని ఆయన ప్రశ్నించారు.

హేమామాలని కారు అప్పడు అతివేగంగా దూసుకువచ్చిందని ఆయన తెలిపారు. అమెకు గోప్ప పేరు, ప్రఖ్యాతులు ఉండవచ్చు.. కానీ మాట్లాడేముందు ఓ సారి ఆలోచించుకోవాలి తన కారు వేగంగా వచ్చి ఢీకొట్టిన హేమా మాలిని డ్రైవర్ ను పోలీసులు వెంటనే ఎందుకు అరెస్టు చేస్తారని అని ప్రశ్నించారు. తనను అనవసరంగా నిందించే బదులు.. ఆ రోజు హేమామాలిని తో పాటు తన చిన్నారిని కూడా ఆస్పత్రికి తీసుకువెళ్లి వుంటే.. కనీసం ఇవాళ పాప బతికి వుండేదని ఆయనబాధాతప్త హృదయంతో చెప్పారు. కాగా హేమా ట్విట్ కు పాప తండ్రి బదులిచ్చిన మరుక్షణం.. నెట్ జనులు అమెను విమర్శలను గుప్పించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress  BJP MP  Mathura  Hema Malini  road accident  Fresh outrage  

Other Articles