Vyapam scam: Namrata Damor’s death was not suicide, autopsy reveals

Namrata damor was murdered says doctor who conducted autopsy

vyapam, vyapam scam, namrata damor, namrata death, vyapam death, cbi proble, mbbs, mp govt, shivraj singh chouhan, Dr B B Purohit (Forensic Medicine), Dr O P Gupta (Medical Officer) and Dr Anita Joshi (Gynaecologist), latest news

As Madhya Pradesh Police decided to reopen the case of her death, the doctors who conducted the post-mortem said they never mentioned in their report that it was a case of suicide.

వ్యాపం స్కాం: ఎంబిబిఎస్ విద్యార్థిని నమత్రది హత్యే

Posted: 07/08/2015 11:13 PM IST
Namrata damor was murdered says doctor who conducted autopsy

మధ్య ప్రదేశ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన 19 ఏళ్ల ఎమ్‌బీబీఎస్ విద్యార్థిని నమ్రతది హత్యేనని వైద్యులు నిర్థారించారు. నమ్రతది సహజ మరణం కావడానికి ఒక్క శాతం కూడా అవకాశం లేదని అమెకు పోస్టుమార్గం చేసిన వైద్యబృందంలోని డాక్టర్ బీబీ పురోహిత్ చెప్పారు. వాస్తవానికి నవ్రగ మూడేళ్ల క్రితమే మరణించినా.. ఆ విషయం గురిచి ఆరా తీసేందుక అమె తండ్రి ఇంటర్య్యూ కోసం వెళ్లిన జర్నలిస్టు అక్షయ్ సింగ్ అత్యంత అనుమానాస్పద రీతిలో మరణించడంతో నమ్రత మరణం విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీంతో నమ్రత కేసును పోలీసులు మళ్ళీ విచారించనున్నారు.

మూడేళ్ళ క్రితం 2012 జనవరలో మాసంలో ఉజ్జయిన్ రైల్వే ట్రాక్‌పై ఆమె మృత దేహం లభ్యమైంది. మొదటగా పోలీసులు అది హత్యగా ఎఫ్‌ఐఆర్‌లో దాఖలు చేసినప్పటికీ, విచారణ అనంతరం ఆత్మహత్యగా తేల్చారు. దీంతో ఈ కేసును 2014లో మూసేశారు పోలీసులు. వ్యాపం కేసుకు సంబంధించిన వారు వరుసగా మృతి చెందుతుండటంతో అమెది నిజంగా ఆత్మహత్యేనా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నమ్రతకు మెడికల్ సీటు అక్రమ మార్గంలో లభించిందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి చీకటి విషయాలను  వెలుగులోకి తీసుకువచ్చేందుకు నమ్రత తండ్రిని ప్రశ్నించడానికి వచ్చిన విలేఖరి అక్షయ్ సింగ్ గత వారం హఠాత్తుగా మరణించిండంతో నమ్రత మరణంపై కూడా అనుమానాలు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన ముగ్గురు సభ్యుల వైద్య బృందం అమెకు పోస్టుమార్టం చేసిందని, తమకు పాతికేళ్లకు పైగా అనుభవం వుందని, డాక్టార్ పురోహిత్ తాజాగా వెల్లడించారు. అమె ముక్కుపైన, నోటి పైన గాయాలున్నాయని, దాని బట్టి చూస్తే..ముక్కు, నోరు మూసేసి ఊపిరాడకుండా చేసి చంపేసినట్ుల తెలుస్తుందని ఆయన తెలిపారు. అమె మరణించిన తరువాత మృతదేహాన్ని రైలు పట్టాల మీదుగా లాక్కెళ్లినట్టు కూడా శరీరం మీద గాయాలును బట్టి స్పష్టమవుతుందని అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vyapam scam  namratha damor  ujjain  

Other Articles