pavan kalyan responds on TDP MPs comments in his own style

I am ready to go to court or jail twitts pavan kalyan

pavan kalyan says kcr steped first for telugu people reunity, pavan kalyan on cash for vote case, section 8, hyderabad, cash on vote, phone tapping, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, sandra venkata veeraiah, Kcr, telangana mlc elections, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, horse riding

actor turned politician jana sena president power star pavan kalyan responded in his own style on TDP MPs comments, twitts he is ready to go to court or jail.

కోర్టులకు, జైలుకు వెళ్లేందుకు నేను సిద్దం: పవన్ కల్యాన్

Posted: 07/08/2015 12:53 PM IST
I am ready to go to court or jail twitts pavan kalyan

ఇరు తెలుగు రాష్ట్రాలలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై సోమవారం మీడియా సమావేశంలో తన అభిప్రాయాలను వెలువరించిన తరువాత ఆంధ్రప్రదేశ్ లోని పలువురు తెలుగుదేశం పార్టీ ఎంపీలు తనపై పోలిస్ స్టేషన్ లో కేసులు పెడతానన్న హెచ్చరికలపై సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ స్పందించారు. టీడీపీ ఎంపీలు తనపై చేసిన విమర్శలపై ఆయన సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఉద్యమించాలని తాను చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు తనపై కేసు పెడతామని హెచ్చరించడాన్ని పవన్ కల్యాన్ సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్ర హితం కోసం తాను జైలుకైనా, కోర్టకైనా వెళ్లడానికి సంతోషమేనని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే అందుకు తగిన ఏర్పాటు త్వరగా చేస్తే మంచిదని, ఎంపీలకు నూచించారు.

pawankalyan-twitter-new01

పోరాడితే పోయేదేమీ లేదు రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కడం తప్ప అని ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీలను ఉద్దేశించి పవన్ కల్యాన్ చేసిన హితోభోద చేస్తే.. వారు మాత్రం ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలలోని పరమార్థాన్ని గ్రహించని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ఆయనపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎంపీల వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు పవన్. ఈ నేపథ్యంలో పవన్ కు టీడీపీకి మధ్య విబేధాలు మరింత రేగేలా వున్నాయిన రాజకీయ విశ్లేషకులు బాశఇస్తున్నారు.

Related News: పవన్ కళ్యాణ్ చెప్పేదాకా.. తెలియదా..?

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pavan kalyan  twitter  AP TDP MPs  parliament members  

Other Articles