YS Jagan | YSR | YSR Birth day | YSRCP | Jagan twitter

Ys jagan tweets about his father late ysr on his birth day

YS Jagan, YSR, YSR Birth day, YSRCP, Jagan twitter

Ys Jagan tweets about his father Late YSR on his birth day. Ys Jagan said that "I miss dad every waking moment. He has left me a large family which stood by me during my difficult times and continues to stands with me"

జగన్.. సెంటిమెంట్ మీద ఆయింట్ మెంట్ బాగానే పూస్తున్నాడు..!

Posted: 07/08/2015 11:35 AM IST
Ys jagan tweets about his father late ysr on his birth day

వైయస్ రాజశేఖర్ రెడ్డి.. ఈ పేరు తెలియని తెలుగు వారు దాదాపుగా ఉండరేమో. తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయేలా ఎన్నో మంచి మంచి పథకాలను ప్రారంభించారు వైయస్ జగన్. అయితే హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించారు. అయితే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైయస్ చనిపోవడంతో రాజకీయంగా ఎన్నో సంచనాలకు కేంద్రంగా మారింది వైయస్ మరణం. అయితే తర్వాత పరిణామాలు మారి వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అయితే తన తండ్రి మరణ వార్త విని చనిపోయిన అభిమానులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తు పరామర్శయాత్ర పేరుతో ప్రారంభమైన జగన్ యాత్రలు ఇప్పటికీ నడుస్తున్నాయి. అయితే వైయస్ జగన్ తన తండ్రి పుట్టిన రోజు నాడు చేసిన ట్విట్టర్ ట్వీట్లు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి.

Also Read:  ‘ఓటుకు నోటు’ కేసులో జ‘గన్’

వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఎంతో మందికి అభిమానం. ఆయన తీసుకువచ్చిన పథకాలు, కార్యక్రమాలు ఎంతో మందికి మేలు చేశాయి. అయితే తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా వైయస్ జగన్ చేసిన ట్వీట్లు జగన్ లోని అసలు రాజకీయ నాయకుడిని బయటకు తీస్తున్నాయి. అయితే తన తండ్రి చనిపోయినపుడే జగన్ సిఎం పీఠం మీద దృష్టిసారించారని, సిఎం పదవి దక్కదని తెలిసినందుకే కొత్తగా పార్టీని పెట్టారని కాంగ్రెస్ నాయకులు చాలా మంది వాదిస్తుంటారు. అయితే అది నిజమేనేమో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే తండ్రి పుట్టిన రోజు నాడు కూడా రాజకీయ కోణంలో ఆలోచించే వాళ్లు ఎంత మంది ఉంటారు చెప్పండి. జగన్ మాత్రం ఖచ్చితంగా పక్కా పొలిటీషియన్ కాబట్టే తండ్రి సెంటిమెంట్ దగ్గర భలే ఆయింట్ మెంట్ రాస్తున్నారు.

ysjagan-tweets

నా ప్రతి సందర్భంలోనూ నాన్నను మిస్ అవుతున్నా.. నా కష్టంలో వెన్నంటి ఉండేలా, ఎల్లప్పుడూ నాకు అండదండగా నిలిచేలా ఓ పెద్ద కుటుంబాన్ని ఆయన నాకు ఇచ్చివెళ్లారు. ఆయన గొప్పదనం, స్పూర్తిదాయకమైన జీవితం, ఆయన గఅడుగుజాడల్లో నేనె నడిచేలా మరింత దైర్ఘాన్ని, మీ మద్దతును నాకివ్వండి అంటూ జగన్ చేసిన ట్వీట్ కొత్త చర్చకు తెర తీసింది. తన తండ్రి పుట్టిన రోజు నాడు తండ్రిని గుర్తుకు చేసుకోవడం గురించి కాదు ప్రశ్న. ఇలాంటి సదంర్భంలో కూడా ప్రజల మద్దతు తనకు కావాలని ఆశపడటం, ప్రజల మద్దతుగా ఆశగా ఉండటం గురించి. అయితే దీన్ని కొంత మంది తప్పుపడితే మరికొందరు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటారా..? వైయస్ కొడుకు కాబట్టి అలా రాయొచ్చు కానీ మిగిలిన వారికి అలా రాసే అవకాశం లేదు కదా అని అంటున్నారు. అయితే జట్టు ఉన్న అమ్మ ఎన్ని కొప్పులైనా కడుతుంది అన్న చందాన్ని ఈ సందర్భంగా అన్వయిస్తున్నారు. మొత్తానికి జగన్ రాజకీయం గురించి కొత్తగా మాట్లాడుకోవాలా అని మరి కొందరు నిట్టూరుస్తున్నారు.

Also Read:  అబ్బా.. జగన్ బాబు ఎంత బాగా చెప్పాడో..
Also Read:  మోసగాడు ఎవరు జగన్..?

BY Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  YSR  YSR Birth day  YSRCP  Jagan twitter  

Other Articles