ap | telangana | Apcm bus | TCM bus, Tdp, CBN, kcr, TRS

Chandrababu naidu likely to buy new bus worth of six crore

ap, telangana, Apcm bus, TCM bus, Tdp, CBN, kcr, TRS

Chandrababu Naidu likely to buy new bus worth of six crore. Telangana cm KCR brought new bus with five crore. Then now Ap cm Chandrababu Naidu likely to buy new bus too.

కేసీఆర్ బస్సు 5 కోట్లు.. మరి చంద్రబాబు బస్సు...?

Posted: 07/04/2015 12:31 PM IST
Chandrababu naidu likely to buy new bus worth of six crore

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పోటీతత్వం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఒకాయన సవాల్ విసిరితే.. మరోకరు తొడగట్టేంత పోటీ. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు సాగుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యవహారం ఇక బస్సులకు చేరింది. ఈ బస్సులకు చేరడం ఏంటా అనుకుంటున్నారా..? కేసీఆర్ తాజాగా ఐదు కోట్లు పెట్టి ఖరీదైన, అత్యాధునిక సదుపాయాలున్న బస్సును కొన్నారు. మరి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు కొంటే చంద్రబాబు నాయుడు మాత్రం చూస్తూ ఊరుకుంటారా ఏంటి..? అవును అలా ఎలా ఊరుకుంటారు అందుకే కేసీఆర్ కన్నా రెండాకులు ఎక్కువగానే చదవిన చంద్రబాబు బస్సు విషయంలో కాంప్రమైస్ అస్సలు అవ్వడం లేదట. మరి అసలు విషయం ఏంటో తెలుసుకోండి.

Also Read: కేసీఆర్ కోసం 5 కోట్ల బస్సు

తెలుగు రాష్ట్రాల సీఎంలు బుల్లెట్‌ప్రూఫ్ బస్సులపై దృష్టిసారించారు.తెలంగాణ సీఎంకు ఇప్పటికే కొత్త బస్సు వచ్చేయగా... వచ్చే నెల్లో ఏపీ సీఎంకి కూడా బస్సు రానుంది.నిఘావర్గాల హెచ్చరికల మేరకు ముఖ్యమంత్రులు ఇలాంటి బస్సుల్ని సిద్ధం చేసుకుంటున్నారు.ఛండీగఢ్‌లోని మెర్సీడెజ్ బెంజ్ యూనిట్ 5 కోట్ల రూపాయలతో  కేసీఆర్‌ బుల్లెట్ ప్రూఫ్ బస్సును తయారుచేసింది.బస్సులోనే బసచేసేందుకు అన్ని సదుపాయాలూ ఉన్నాయి.ఈ బస్సుకు ఎలాంటి దాడినైనా తట్టుకునే సామర్ధ్యం ఉంది.దీని టైర్లు కూడా బుల్లెట్ ప్రూఫ్‌ వే. ఒకవేళ ప్రమాదవశాత్తు టైర్లు దెబ్బతిన్నా దాదాపు 30 కిలోమీటర్ల వరకూ ఆగకుండా ప్రయాణించే అవకాశం ఉంది.గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లినా... లోపల ఎలాంటి బడలికా ఉండదు.ప్రస్తుతం ఈ బస్సును తెలంగాణ ఆర్టీసీ పర్యవేక్షిస్తోంది.రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక... ఇందులో కేసీఆర్ జిల్లా పర్యటనలకు వెళ్లనున్నారు.

Also Read: ఐదు కోట్ల కేసీఆర్ బస్సులో కనీసం బెడ్ కూడా లేదట

ఏపి సీఎం చంద్రబాబు కూడా బుల్లెట్‌ప్రూఫ్,యాంటి ల్యాండ్‌మైన్ బస్సుకు ఆర్డరిచ్చారు.తనతోపాటు మంత్రులు కూడా ప్రయాణించే వీలుండే బస్సును 6 కోట్ల రూపాయలతో తయారుచేయిస్తున్నారు.అంటే కేసీఆర్‌కి తయారుచేసిన బస్సు కంటే ఒక కోటి ఎక్కువ.ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలాసార్లు బస్సుయాత్రలు చేశారు. ఐతే... ఆ బస్సులు సాదాసీదావే. వాటిలోనూ కొన్ని సదుపాయాలు ఉన్నా అవి బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనాలు కాదు. వచ్చే నెల్లో APSRTC కొంటున్న కొత్త బస్సు ద్వారా జిల్లాల్లో పర్యటించనున్నారు చంద్రబాబు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  telangana  Apcm bus  TCM bus  Tdp  CBN  kcr  TRS  

Other Articles