KCR | Bus | Telangana | Five Crore

Whats wrong with his other cars telangana reacts to kcrs 5crore bus

KCR, Bus, Telangana, Five Crore

Whats Wrong With His Other Cars Telangana Reacts to KCRs 5Crore Bus A bullet-proof Mercedes-Benz bus has been purchased for Chief Minister K Chandrasekhar Rao for his tours of Telangana. The cost to the state is five crores. The white bus was the subject of a puja this morning in Hyderabad, the capital of Telangana.

ITEMVIDEOS: కేసీఆర్ బస్సు.. ఐదు కోట్లు కానీ కనీసం బెడ్ కూడా లేదు

Posted: 07/03/2015 04:51 PM IST
Whats wrong with his other cars telangana reacts to kcrs 5crore bus

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప‌ర్యట‌న‌ల కోసం ఓ ప్రత్యేక బ‌స్సు త‌యారైంది. అత్యంత భ‌ద్రతా ప్రమాణాలు క‌లిగిన బ‌స్సు కొన్నిప్రాంతాల‌లో ఆయ‌న ప‌ర్యట‌న‌ల కోసం వినియోగిస్తారు. ఈ బస్సు తయారీకి మొత్తం రూ. 5 కోట్ల వరకు ఖర్చయింది. చండీగఢ్లో తయారుచేసిన ఈ బస్సును.. హైదరాబాద్ నగరానికి గురువారం తీసుకొచ్చారు. ఈ బస్సులో అత్యాధునిక హంగులు కూడా ఉన్నాయి.  వీడియో కాన్ఫరెన్సు నిర్వహించేందుకు కూడా ఇందులో ఏర్పాట్లు చేశారు. ఇందులో వై-ఫైతో పాటు అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఈ వాహనం హైదరాబాద్ నగరానికి రావడంతో.. ముఖ్యమంత్రికి ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లయింది. ఇక్కడ కావల్సిన ఏర్పాట్లు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. దీన్ని కేసీఆర్ త్వరలోనే వాడనున్నారు. అయితే ఈ బస్సులపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేవలం పర్యటనల కోసమే ఐదు కోట్లు ఖర్చు పెట్టి మరీ బస్సును కొనుగోలు చెయ్యాలని అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే దీనిపై కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కోసం కొత్తగా తయారుచేయించిన బస్సులో కేసీఆర్ పడుకోవడానికి కనీసం బెడ్ కూడా లేదని సిఎంఓ అధికారులు వెల్లడించారు. కేవలం 12 మంది ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది కూర్చోవడానికి, మిగిలిన అత్యాధునిక ఎక్వీప్ మెంట్ మాత్రమే బస్సులో ఉన్నాయని తెలిపారు. అయినా అంత ఖర్చు చేసి బస్సును కొన్న కేసీఆర్ బెడ్ ఎందుకు పెట్టించుకోలేదు అని అందరికి సందేహం. మరి ఎందుకో కేసీఆర్ కే తెలియాలి.

Related News : కేసీఆర్ కోసం బెంజ్ బస్సు..

కేసీఆర్ కోసం బెంజ్ బస్సు..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Bus  Telangana  Five Crore  

Other Articles