ugc releases list of 21 fake universities operating in india

Ugc releases list of fake universities

ugc releases list of fake universities, UGC, Fake Universities, India, UP tops the list, UGC Act, Bihar, Delhi, karnataka, tamilnadu, west bengal, kerala, madyapradesh, maharastra

The University Grants Commission, the apex body for higher education, on Wednesday published a list of fake universities in the country for the benefit of students.

దేశంలో నకిలీ విశ్వవిద్యాలయాలు.. జాబితా అందిస్తున్నాం.. జాగ్రత్తా..

Posted: 07/01/2015 11:31 PM IST
Ugc releases list of fake universities

అరచేతిలో వైకుంఠం చూపి.. మీరు రాకుండానే మీకు సంబంధిత చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు ఇస్తూ.. తీరా వేలకోద్ది రూపాయలను ధారపోసిన తరువాత అ సర్టిఫికెట్లు పనిచేయవని తెలిస్తే.. ఆ బాధితుల భాధ వర్ణణాతీతం. జేబులో డబ్బులతో పాటు చదువుకునే అమూల్యమైన సమయాన్ని కూడా జారవిడుదుకున్నామని వారు పడే అవేదన అంతా ఇంతా కాదు. అందుకే దేశంలో ఉన్నత విద్యకు సంబంధించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశంలోని నకిలీ యూనివర్సిటీల జాబితాను విడుదల చేసింది.

దేశ వ్యాప్తంగా మొత్తం 21 యూనివర్సిటీలను నకిలీ యూనివర్సిటీలుగా తేల్చింది. ఈ జాబితా మొత్తంలో 8 వర్సిటీలు ఉత్తరప్రదేశ్‌లో ఉండగా, 6 వర్సిటీలు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నాయి. మిగత నకిలీ విశ్వవిద్యాలయాలు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నాయి. యూజీసీ గుర్తించిన 21 విశ్వవిద్యాలయాలు చట్ట విరుద్ధంగా ఏర్పాటై కార్యకలాపాలు సాగిస్తున్నాయని యూనివర్సిటీ గ్రాండ్స్ కమీషన్ తేల్చింది. నకిలీ యూనివర్సిటీలు జాబితా ఇదే.. ఇకపై జాగ్రత్తగా వ్యవహరించండీ

 1. మైథిలి విశ్వవిద్యాలయం, దర్భాంగా, బీహార్
2. వారన్‌సేయ సంస్కృతం విశ్వవిద్యాలయ, ఢిల్లీ
3. కమర్షియల్స్ విశ్వవిద్యాలయం లిమిటెడ్, ఢిల్లీ
4. యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ, ఢిల్లీ
5. ఒకేషనల్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ
6. ADR- సెంట్రల్ జ్యుడీషియల్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ
7. ఇండియన్ ఇనిట్యూషన్ ఆఫ్ సైన్సు అండ్ ఇంజనీరింగ్, ఢిల్లీ
8. బడాగ్నవి సర్కార్ వరల్డ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, బెల్గాం, కర్ణాటక
9. సెయింట్ జాన్స్ యూనివర్శిటీ, కిషనట్టమ్, కేరళ
10. కేసరవాణి విద్యాపీట్, జబల్పూర్, మధ్య ప్రదేశ్
11. రాజా అరబిక్ విశ్వవిద్యాలయం, నాగ్పూర్, మహారాష్ట్ర
12. DDB సంస్కృత విశ్వవిద్యాలయం, పుతుర్, తిరుచ్చి, తమిళనాడు
13. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోలకతా, పశ్చిమ బెంగాల్
14. మహిళా గ్రామ విద్యాపీట్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్
15. మహాత్మా గాంధీ హిందీ విద్యాపీట్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్
16. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్, ఉత్తరప్రదేశ్
17. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విశ్వవిద్యాలయం, అలిగర్, ఉత్తర ప్రదేశ్
18. ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ, ఉత్తర ప్రదేశ్
19. మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విద్యాలయ, ప్రతాప్గఢ్, ఉత్తర ప్రదేశ్
20. ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్, నోయిడా రెండో దశ, ఉత్తర ప్రదేశ్
21. గురుకుల్ విశ్వవిద్యాలయ, మథుర, ఉత్తర ప్రదేశ్

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ugc  university  new delhi  uttar pradesh  tamil nadu  karnataka  

Other Articles