Jayalalithaa returns to Tamil Nadu Assembly with huge win

Aiadmk chief jayalalithaa returns to tn assembly with massive win

AIADMK chief Jayalalithaa returns to TN Assembly with massive win, jayalalithaa, tamil nadu, bypoll, counting, byelection, aiadmk, chennai. R K Nagar Assembly, AIADMK.

AIADMK supremo and Tamil Nadu Chief Minister Jayalalithaa has won the R K Nagar Assembly bypoll with huge margins.

రికార్డు విజయంతో చరిత్ర సృష్టించిన జయలలిత

Posted: 06/30/2015 03:20 PM IST
Aiadmk chief jayalalithaa returns to tn assembly with massive win

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రికార్డు సృష్టించారు. అక్రమాస్థులు కూడబెట్టుకున్నారన్న ఆబియోగాల నేపథ్యంలో అమె రాజీనామా చేసిన ఎమ్మెల్యే స్థానానికి కోర్టు నిర్దోషిగా విడుదల చేయడంతో జరిగిన అర్కే నగర్ ఉప ఎన్నికలలో మునుపెన్నడూ లేణి భారీ మోజారిటీతో అమ్మ రికార్డు సృష్టించారు. జయలలిత తన ప్రత్యర్థులపై ఏకంగా లక్షా యాబై రెండు వేల 46 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మొదటి రౌండ్ నుండి ఆమె ప్రత్యర్థుల మీద మెజారిటితో ముందుకు దూసుకు వెళ్లారు. 15వ రౌండ్ నుండి 17వ రౌండ్ వరకు జయలలిత ఏకపక్షంగా మెజారిటి సాధించారు. సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ కు కేవలం 8,875 ఓట్లు వచ్చాయి. జయయలిత గెలుపుతో తమిళనాడులో ఆమె అభిమానులు పార్టీ కార్యకర్తలు పండగ చేసుకున్నారు.

నియోజకవర్గంలో నమోదైన 74.4 శాతం ఓట్లలో సుమారుగా 90 శాతం మంది ప్రజలు జయలలిత అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. జయలలితకు మొత్తంగా 1, 60, 921 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి సిసిఐ పార్టీకి చెందిన మహేంద్రన్ కు 8875 ఒట్లు మాత్రమే పోలయ్యాయి. కాగా ఈ ఎన్నికల బరిలో నిలిచిన 27 మంది అభ్యర్థులు తమ ధరావత్తును కోల్పోయారు. జయలలిత అధిక్యం దేశంలోనే ఒక రికార్డుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ అధినేత్రి కడిగిన ముత్యమని నియోజకవర్గ ప్రజలు అమెను భారత అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తిరుగులేని రికార్డు విజయాన్ని అందించారని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో జయలలిత విజయంతో చైన్నైలో కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

గతంతో ఎపిలోని తిరుపతిలో టిడిపి అభ్యర్ధి సుమారు లక్షా పాతికవేల ఆధిక్యతతో గెలుపొందారు.ఇప్పుడు చెన్నైలోని ఆర్.కె.నగర్ నియోజకవర్గం నుంచి జయలలిత ఆ రికార్డును అధిగమించి కొత్త రికార్డు సృష్టించారు.ఈ ఉప ఎన్నిక పలితం భవిష్యత్తులో జరగబోయే సాధారణ ఎన్నికలకు సంకేతం అని అన్నా డి.ఎమ్.కె. పార్టీ శ్రేణులు సంబరం చేసుకుంటున్నాయి. కాగా ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం అయిన డి.ఎమ్.కె. పోటీలో లేదు.తమిళనాడు గవర్నర్ రోశయ్య ముఖ్యమంత్రి జయలలితకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalithaa  tamil nadu  bypoll  counting  aiadmk  R K Nagar Assembly  

Other Articles