whatsapp | vchat | skype | social media | social connectivity | indians | net users

Indian smart phone users spending 47percent time on watsapp

whatsapp, vchat, skype, social media, social connectivity, indians, net users

Indian smart phone users spending 47percent time on watsapp, skype, v chants etc. In a new report clear that india samrt phone users spending more time on social media connectivity.

47శాతం టైం వాట్సాప్, స్కైప్ లాంటి వాటి మీదే

Posted: 06/29/2015 08:37 AM IST
Indian smart phone users spending 47percent time on watsapp

ఒకప్పుడు హస్త భూషణం అని అనే వారు.. కానీ కాలం మారింది పుస్తకానికి ఎప్పుడో కాలం చెల్లింది. తాజాగా స్మార్ట్ పోన్ చేతిలోకి వచ్చేసింది. అయితే ఆ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్, షేస్ బుక్ లాంటి సోషల్ కనెక్టివిటి లేకపోతే దండగ అనే ఫిలింగ్ చాలా మందికి ఉన్నారు. అయితే వాట్సాప్ యూజర్ల జాబితా అంతకంతకు పెరిగిపోతోంది. ఫోన్ చేసుకునే కన్నా కూడా వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ద్వారా ఛాటింగ్ చేస్తూ ముచ్చటిస్తున్నారు. అయితే గతంలో కన్నా విపరీతంగా వాట్సాప్ వాడకం పెరగిపోయింది. ప్రతి విషయాన్ని వాట్సాప్ ద్వారా షేర్ చెయ్యడం ఫ్యాషనైపోయింది. ఒక్క వాట్సాప్ తో కాదు వి ఛాట్, స్కైప్ లాంటివి కూడా ఇదే కోవలోకి వస్తాయి. చుట్టు పక్కల ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా మరిచిపోయి ఛాటింగ్ లో అంతలా లీనమైపోతున్నారు స్మార్ట్ యూజర్లు.

అయితే ఇండియాలోని స్మార్ట్‌ఫోన్‌ వాడకందారులు వాట్సాప్‌, వి చాట్‌, హైక్‌, స్కైప్‌ లాంటి సోఫల్ మీడియా యాప్‌లపైనే  47 శాతం సమయాన్ని కేటాయిస్తున్నారని తాజాగా ఓ నివేదికలొ వెల్లడైంది. ఈ అప్లికేషన్లే మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగానికి మెయిన్ రోల్ గా మారుతున్నాయని దానిలో తేలింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో సోషల్ మీడియా యాప్ ల హవా కొనసాగుతోంది.. కొత్త కొత్త యాప్ ల వినియోగంపై స్మార్ట్ ఫోన్ వినియోగదారులు చాలా ఇంట్రస్ట్ గా ఉన్నారు. అయితే  సోషల్ మీడియాలో కనెక్టివిటి కోసం నెట్ వాడకం బాగా పెరిగింది. అయితే గతంలో నెట్ వినియోగం కన్నా సోషల్ మీడియా కనెక్టివిటి కలిగిన వాట్సాప్, వి ఛాట్, స్కైప్ లాంటి యాప్ ల రాకతో నెట్ వినియోగం విపరీతంగా పెరిగిందని స్వీడన్‌ టెలికాం పరికరాల తయారీసంస్థ ఇరిక్‌సన్‌ నివేదికలో తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న భారతీయులు వారి సమయంలో 47 శాతాన్ని సోషల్ మిడియా కనెక్టివిటి అప్లికేషన్లపైనే గడుపుతున్నారని ఈ నివేదిక తెలిపింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : whatsapp  vchat  skype  social media  social connectivity  indians  net users  

Other Articles