Tender, Wines, Liquior, ap, Krishna,

Heavy competetion in the liquior shops tender

Tender, Wines, Liquior, ap, Krishna,

Heavy competetion in the Liquior shops tender. in ap total wine shops tender for 3125 got 65174 applications.

మందు దుకాణాలు 3125.. దరఖాస్తులు 65,174

Posted: 06/29/2015 08:13 AM IST
Heavy competetion in the liquior shops tender

ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాకం, కర్నులు జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాలలో మద్యం దుకాణాల కోసం కనీవినీ ఎరుగని రీతిలో దరఖాస్తులు వచ్చాయి. 11 జిల్లాల్లో మొత్తం 3125 దుకాణాలకు గాను 65, 174 దరఖాస్తులు వచ్చాయి. అన్ని జిల్లాల కంటే గుంటూరు జిల్లాలో 303 దుకాణాలకు గాను అత్యధికంగా 11, వేల 548 దరఖాస్తులు రాగా ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలో 400 దుకాణాలకు గాను 11, 162 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాల వారీగా మద్యం దుకాణాల సంఖ్య...వాటి కోసం అందిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 202 దుకాణాలకు గానున 4వేల526 దరఖాస్తులు రాగా...విజయనగరం జిల్లాలో 179 దుకాణాలకు 3వేల 512 దరఖాస్తులు వచ్చాయి. విశాఖ జిల్లాలో 330 దుకాణాలకు గాను5వేల846 దరఖాస్తులు వచ్చాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో 410 దుకాణాలకు 6వేల 800 దరఖాస్తులు, పశ్చిమ గోదావరిలో 400 దుకాణాలకు 11వేల 162 దరఖాస్తులు వచ్చాయి. కృష్ణ జిల్లాలో 294 దుకాణాలకు గాను 6వేల995 దరఖాస్తులు అందగా, గుంటూరు జిల్లాలో 303 దుకాణాలకు అత్యధికంగా 11వేల 548 దరఖాస్తులు అందాయి. నెల్లూరు జిల్లాలో 291 దుకాణాలకు గాను 5800 దరఖాస్తులు వచ్చాయి. కపడలో 190 దుకాణాలకు 2వేల 161 దరఖాస్తులు, చిత్తూరు జిల్లాలో 320 దుకాణాలకు 3వేల 48 దరఖాస్తులు, అనంతరపురంలో 206 దుకాణాలకు గాను 3వేల 786 దరఖాస్తులు అందాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tender  Wines  Liquior  ap  Krishna  

Other Articles