Gangrape | gangrape victim | love | Marriage | Guntur

Man married his lover and gangrape victim in guntur

Gangrape, gangrape victim, love, Marriage, Guntur

Man married his lover and gangrape victim in Guntur. Rajesh, who married gangrape victim grandly with lot of love.

గ్యాంగ్ రేప్ అమ్మాయిని పెళ్లాడిన అబ్బాయి

Posted: 06/29/2015 09:52 AM IST
Man married his lover and gangrape victim in guntur

నమ్మి తనతో ఏడు అడుగులు నడిచి ఆరు కాలాల పాటు చల్లగా ఉండాలని వచ్చిన ఓ అమ్మాయికి తీరని అన్యాయం జరిగింది. తను ప్రేమించిన వాడితో జీవితాంతం తోడుగా ఉండాలని అనుకుని వచ్చిన ఓ అమ్మాయిని కొదరు కీచకులు చర బట్టారు. అయితే అత్యాచారం జరిగినా.. తనను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి పెళ్లి చేసుకుంటాను అంటూ ఆ ప్రేమికుడు ముందుకు వచ్చి పెళ్లి చేసుకొని ఆదర్శ వివాహం అనే మాటకు కొత్త రూపు తీసుకువచ్చాడు. గుంటూరు జిల్లాకు చెందిన రాజేశ్ అనే యువకుడు. పక్కింట్లో ఉంటున్న యువతి ప్రేమించుకుంటున్నారు. అయితే వారు లేచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. అయితే దూరంగా వెళ్లి పెళ్లి చేసుకుందామని రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. కానీ అక్కడ ఓ అమ్మాయి మీద కొందరు కామాంధుల కన్ను పడింది. పోలీసులమంటూ చెప్పి ఆ ప్రేమికులను బెదిరించి, అమ్మాయిని బైక్ పై ఎక్కించుకువెళ్లి రేప్ చేశారు నలుగురు వ్యక్తులు.

అయితే అత్యాచారానికి గురైనా కానీ తను ప్రేమిస్తున్నాడు కాబట్టి పెళ్లి చేసుకోవడానికి సిద్దపడ్డాడు రాజేశ్. అలా అత్యాచారం జరిగిన ఒక రోజు తర్వాతే అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించే మనసు కల్మషం లేని ప్రేమను మాత్రమే చూస్తుంది తప్ప మిగిలిన వాటిని పట్టించుకోదు అన్న నిజాన్ని నిరూపించాడు రాజేశ్. ఆ అమ్మాయి వచ్చిందే తనను నమ్మి.. అలా వ్చినందుకే కామాంధుల చేతిలో బలైంది కనుక తనను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ పెళ్లి చేసుకొని కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. ఇలా అత్యాచార బాధితులకు బాసటగా నిలిచే మగాళ్లకు మనసారా చేస్తున్నాం సాల్యూట్

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gangrape  gangrape victim  love  Marriage  Guntur  

Other Articles