Ravindrababu | Free Ration | Free alchohol | Arnab | Times now | Parliament

Tdp mp ravindra babu said people joins army for free ration and free liquior

Ravindrababu, Free Ration, Free alchohol, Arnab, Times now, Parliament

TDP MP Ravindra Babu said people joins army for free ration and free liquior. In the times now show arnab oppose the statements of Ravindrababu.

ITEMVIDEOS: మందు కోసమే ఆర్మీలో చేరతారన్న టిడిపి ఎంపీ

Posted: 06/25/2015 10:17 AM IST
Tdp mp ravindra babu said people joins army for free ration and free liquior

దేశ రక్షణలో భాగంగా తమ జీవితాలను అంకితం చేసే ఆర్మీలో పని చేసే సైనికుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫ్రీగా రేషన్, సబ్సిడీలో మందు, ఎంజాయ్ చేయడానికి ఫ్రీ హాలిడేస్ కోసమే మిలట్రీలో చేరుతారని తెలుగుదేశం పార్టీ ఎంపీ పీ.రవీంద్రబాబు వివాదాస్పదమైన కామెంట్లు చేశారు. ఆయనను అగ్గిపెట్టె తీసుకొని విమానంలో వెళ్లనివ్వలేదట. దాంతో ఆ ఎంపీకి కోపమొచ్చింది. టైమ్స్ నౌ లో జరిగే న్యూస్ అవర్ డిస్కషన్ లో పాల్గొన్న ఆయన అదే డిస్కషన్ లో పాల్గొన్న మాజీ సైనికాధికారి మేజర్ విజయ్ పై తన అక్కసునంతా తీర్చుకున్నాడు. తాము మిలట్రీ వాళ్ళలాగా కాదని ప్రజలెన్నుకున్న ప్రతినిధులమని అన్నారు .రవీంద్రబాబు ఆర్మీ అధికారులలాగా అన్ని సౌకర్యాలు లేవని  కూడా తెలిపారు. ఆర్మీ అధికారుల లాగా తమకు 65 రోజుల సెలవు లేదని అలాగే తాగడానికి ఫ్రీగా మందు కూడా దొరకడం లేదని అన్నారు. స్వచ్ఛందంగా తాము రాజకీయాల్లోకి వచ్చామని, గ్రామీణ ప్రజలకు సేవ చెయ్యడానికి తాము వచ్చామని రవీంద్రబాబు అన్నారు. తనను మిలిటరీ పాలనలోలాగా ఆదేశించలేరని కూడా రవీంద్రబాబు తెలిపారు.  దీనిపై అర్ణవ్ తో పాటు డిస్కషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అతని పై చర్య తీసుకోవాలని ఆర్ణవ్ గోస్వామి డిమాండ్ చేశారు. అయినా ఆయన ధోరణి మారకపోవడంతో ఆయన తరపున మేజర్ విజయ్ కి అర్ణవ్ క్షమాపణలు చెప్పారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravindrababu  Free Ration  Free alchohol  Arnab  Times now  Parliament  

Other Articles