Section8 | Schedule10 | ap | Telangana

Ap govt move on the schedule ten

schedule 10, tenth schedule, telangana, sections 8, hyderabad, ap

Ap govt move on the schedule ten.ap govt appoints new chiefs to the tenth schedule organisations. But telangana employees opposing the ap govt decision.

ఏపి, తెలంగాణ మధ్యలో ఎనిమిది, పది

Posted: 06/25/2015 08:56 AM IST
Ap govt move on the schedule ten

సెక్షన్ 8 మీద తెలుగు రాష్ట్రాలు మరోసారి వివాదానికి తెర తీసాయి. విభజన చట్టంలోని సెక్షన్ 8 ను అమలు చెయ్యాలని ఏపి ప్రభుత్వం వత్తిడి తీసుకువస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది. తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా చట్టంలో పేర్కొన్న సెక్షన్ 8 ను అమలు చేసేందుకు గవర్నర్ కు బాధ్యతలు అప్పగించాలని ఏపి ప్రభుత్వం వత్తిడి తీసుకువస్తోంది. ఓటుకు నోటు వ్యవహారం కాస్తా ట్యాపింగ్ వివాదంగా మారింది. నారా చంద్రబాబు నాయుడుకు ఇది ఎంతో తలనొప్పులు తీసుకువచ్చింది. ట్యాపింగ్ వివాదం తెర మీదకు వచ్చిన తర్వాత ఏపి ప్రభుత్వం సెక్షన్ 8 ను అమలు చెయ్యాలని ప్రతిపాదనను తెర మీదకు తీసుకువచ్చింది. దాంతో సెక్షన్ 8 తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇక తాజాగా షెడ్యూల్ 10 మీద రగడ ప్రారంభమైంది. ఏపి ప్రభుత్వం తెర మీదకు షెడ్యూల్ 10 లోని అంశాలను తీసుకువచ్చింది.  

రాష్ట్ర విభజన చట్టంలో పదో షెడ్యూలులో చేర్చిన ప్రధాన సంస్థలన్నింటికీ తమ ప్రభుత్వం తరఫున అధిపతులను నియమించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతేకాదు, పదో షెడ్యూలు సంస్థల నిధులను ప్రత్యేక ఖాతాలకు తరలించాలని తీర్మానించుకుంది. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌డైరెక్టర్‌ జనరల్‌గా ముకేశ్‌ కుమార్‌ మీనాను నియమించింది. ఈ సంస్థకు తెలంగాణ సర్కారు ఇదివరకే డీజీగా కె.రామకృష్ణారావును నియమించింది. ఆయన సెలవుపై వెళుతుండటంతో, ఆయన స్థానంలో ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ను ఇన్‌చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే... జీఏడీ (పొలిటికల్‌) కార్యదర్శి ముకేశ్‌ కుమార్‌ మీనాను కూడా సీజీజీ డైరెక్టర్‌ జనరల్‌గా నియమిస్తూ ఏపీ సర్కారు హుటాహుటిన ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా తెలంగాణ ప్రభుత్వం వినోద్‌ కుమార్‌ అగర్వాల్‌ను ఇదివరకే నియమించగా... ఏపీ ప్రభుత్వం అదే సంస్థకు లింగరాజు పాణిగ్రాహిని అధిపతిగా నియమించింది. పదో షెడ్యూల్‌లోని సంస్థలపై తెలంగాణ ప్రభుత్వంతోపాటు తమకూ హక్కు ఉంటుందని ఏపీ సర్కారు వాదిస్తోంది.

పదో షెడ్యూల్‌లో 147 సంస్థలు ఉన్నాయి. అందులో సుమారు 15 ప్రధాన సంస్థలపైనే గట్టిగా పట్టుపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌), ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ, సీజీజీలతో పాటు మరికొన్ని ముఖ్య సంస్థలపై ఏపీ ప్రభుత్వం దృష్టి ఉంది. ఈ వివాదం నేపథ్యంలో ఏపీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌శర్మతో ఫోన్‌లో మాట్లాడారు. ‘ఇది సాంకేతిక నియామకమే. ఇందులో వివాదానికి తావు లేదు’ అని తెలిపారు. మరోవైపు పదో షెడ్యూలులోని సంస్థలన్నీ తమకే చెందుతాయని టి-సర్కార్‌ స్పష్టం చేసింది. తగిన రుసుము చెల్లించి ఆ సంస్థల నుంచి ఏపీ ప్రభుత్వం సేవలు పొందవచ్చునని చెప్పింది. అలా మొత్తానికి హైదరాబాద్ లో ఉంటున్న పదో షెడ్యూల్ లోని సంస్థలపై తమ ఆధిపత్యాన్ని కూడా కొనసాగించాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఏపి ప్రభుత్వం నిర్ణయాన్ని తెలంగాణ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఏపి వారి పెత్తానాన్ని వ్యతిరేకిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడ దాకా వెళుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : schedule 10  tenth schedule  telangana  sections 8  hyderabad  ap  

Other Articles