పురాతనకాలం నుంచి వస్తున్న సంస్కృతీ-సంప్రదాయాల ప్రకారం.. మహిళలు కొన్ని ఆచారాలు పాటించాల్సి వుంటుంది. అలాగే.. వారికి కొన్ని పరిమితులు వుంటాయి. పెళ్లికి ముందు ఒకరకంగానూ, పెళ్ళి తర్వాత మరో రకంగానూ వారు జీవితం కొనసాగించాలన్న నియమనిబంధనలు వుంటాయి. ముఖ్యంగా శృంగార విషయంలో వీరు ఎంతో నిబంధనలు పాటించాలి. పెళ్లికిముందు ఏ మగాడితోనైనా శృంగార సంబంధం వుంటే మాత్రం సమాజంలో వారికి ఏమాత్రం గౌరవం లభించదు. పెళ్లి తర్వాత భర్తతో ఆ సుఖాన్ని అనుభవించాలి. పెళ్లి తర్వాత ఎవరితోనైనా అక్రమ సంబంధాలున్నా వారికి తగిన శాస్తి జరుగుతుంది. కానీ.. ఒక జాతి మహిళలకు మాత్రం శృంగార విషయంలో పూర్తి స్వేచ్ఛ వుంది. పెళ్లికిముందు వారు ఎవరితోనైనా శృంగార సుఖాన్ని పొందవచ్చు. ఇంకా ఎన్నో స్వేచ్ఛలు ఆ మహిళలకు వున్నాయి.
సహారా ఎడారి ప్రాంతంలో నివసించే ఆ జాతి పేరు ‘త్వారెగ్’. వెయ్యేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ జాతివారు ప్రస్తుతం మోలి, నిగర్, ఉత్తర నైజీరియా, అల్జీరియా, ఆగ్నేయా లిబియా వంటి ఎడారి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దాదాపు కోటిన్నర జనాభా వున్న ఈ జాతిలోని మహిళలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వున్నాయి. అందులో ముఖ్యంగా శృంగార స్వేచ్ఛ. పెళ్లియ్యేవరకు వీరు ఎవరితోనైనా శృంగార అనుభవాన్ని పొందవచ్చు. రోజుకొకరితోనైనా గడపవచ్చు. అయితే.. పెళ్లి తర్వాత మాత్రం కేవలం భర్తతోనే ఆ సుఖాన్ని అనుభవించాలి. ఒకవేళ భర్త నచ్చకపోతే ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చు. ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. ఇంకొక విశేషమేమిటంటే.. పెళ్లిని ఎంత ఆడంబరంగా చేస్తారో.. విడాకులను కూడా అంతే వైభవంగా నిర్వహిస్తారు. ఎందుకంటే.. భర్తతో విడాకులు తీసుకున్న సదరు మహిళల పెళ్లి చేసుకోవడానికి మరో అవకాశం దొరికిందని మగవాళ్లకు తెలియజెప్పడం కోసం. యువతులకు 20 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లి చేస్తారు.
ఇంకొక సంచలన విషయం ఏమిటంటే.. అరబిక్ కు దగ్గరగా వుండే భాషలో మాట్లాడే వారి మతం ఇస్లాం. నిజానికి ఇస్లాం మతంలో మహిళలకు కఠినమైన నియమాలుంటాయి. బురఖాలు ధరించడం, పరాయి మగాళ్లతో మాట్లాడకుండా వుండటం, భర్తతోనే శృంగారంలో పాల్గొనడం.. ఇంకా ఎన్నో నియమాలు వుంటాయి. కానీ.. ‘త్వారెగ్’ జాతివారు మాత్రం అందుకు భిన్నంగా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇస్లాం మతం పుచ్చుకున్నప్పటికీ.. వెయ్యేళ్ల తమ సంస్కృతిని మాత్రం అలాగే పరిరక్షించుకుంటూ వస్తున్నారు. ఈ జాతి మహిళలు బురఖాలు ధరించరు కానీ.. విచిత్రంగా మగవాళ్లు ధరిస్తారు. దుష్టశక్తులు ఆవహించకుండా వుండేందుకే మగవాళ్లకు ఈ ఏర్పాటని వారు చెబుతారు. ఈ జాతివాళ్లు గుడారాల్లోనే ఆడ, మగ కలిసి జీవిస్తారు. అయినా మహిళలకు తమకంటూ ప్రత్యేక ప్రైవసీ వుంటుంది. పెళ్లికాకముందు ఓ యువతి తాను ఎంచుకున్న యువకుడిని గుడారంలోకి తీసుకొస్తే.. ఇతర కుటుంబసభ్యులు ఆ విషయాన్ని గ్రహించి గడపాలి. వారికి వీలైనంత స్వేచ్ఛ కల్పించాలి.
ఇక పెళ్లి విషయానికొస్తే.. పెళ్లి సమయంలో యువతులు కట్నంగా తమ గుడారాన్ని, ఒంటెలు, గాడిదలు లాంటివి జంతువులను పెళ్లకొడుక్కు సమర్పిస్తారు. పెళ్లైన తర్వాత ఏ మగాడు తన భార్యముందు, ఇతర మహిళల ముందు భోజనం చేయకూడదని వెయ్యేళ్ల నుంచి వస్తున్న ఆచారం. కానీ ఇటీవల ఇందులో కాస్త మార్పు జరిగింది. భార్య ముందు భోజనం చేయవచ్చుగానీ.. అత్తముందు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తినకూడదు. ఒకవేళ భర్త నుంచి భార్య విడాకులు తీసుకుంటే.. అతనికిచ్చినవన్నీ వెనక్కి తీసుకుంటారు. పిల్లలు కూడా తల్లితో వుండాల్సిందే. మహిళలు మగాళ్లతో సమానంగా అక్కడ పనిచేస్తారు. ఒంటెలపై స్వారీ చేయడం, గాడిదలతో పని చేయించడం.. ఇంకా ఎన్నెన్నో! ఇదంతా చూస్తుంటే.. ‘జంబలకిడి పంబ’ సినిమాలోలాగా అనిపిస్తోంది కదూ. కానీ.. అలాంటిదేమీ కాదు. ఇంట్లో వంటావార్పు, పిల్లల పోషణ మహిళలే చూసుకుంటారు. ఇక రాజకీయాలు నెరిపేది మాత్రం పురుషులే. అయితే.. మహిళలకు శృంగారంతోపాటు ఎన్నో స్వేచ్ఛలు వుంటాయి.
మహిళలకు ఈ విధంగా శృంగార స్వేచ్ఛను కల్పించడంపై ‘త్వారెగ్’ జాతివారు ముస్లిం మతఛాందసుల నుంచి దాడులకు ఎదుర్కొంటున్నారు. లిబియా సరిహద్దుల్లో అక్కడి ముస్లిం తీవ్రవాదుల నుంచి, నైజీరియాలో బొకోహరాం తీవ్రవాదుల నుంచి ఈ జాతివారు తరుచూ దాడులను ఎదుర్కొంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Jul 02 | దేశంలో రాష్టప్రతి ఎన్నికలకు తెర లేచిన సందర్భంలో ఈ ఎన్నికలు ఇద్దరు వ్యక్తులకు సంబంధించినవి కావని, రెండు సిద్దాంతాల మధ్య పోరుగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కోన్నారు. దేశంలో నెలకొన్న ‘అసాధారణ... Read more
Jul 02 | భూమిపైన ఉన్న జంతుజాలంలో మనకు కనబడనవాటినే మనం గుర్తిస్తాం. కానీ మనకు తెలియని ఎన్నోరకాల జీవచరాలు భూమిపై ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? ఇక మనకు తెలిసిన వాటిలోనూ ఎన్నో అరుదైన జీవులు వున్నాయని,... Read more
Jul 02 | రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా టీఆర్ఎస్ నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వంగలవారని తెలిపారు. న్యాయవాదిగా... Read more
Jul 02 | దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అత్యంత వేగంగా స్పందించిన పైలట్లు వెనువెంటనే తీసుకున్న చర్యలతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికులతో పాటు క్యాబిన్... Read more
Jul 02 | దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల బలపర్చిన అభ్యర్థి, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా హైదరాబాదుకు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్... Read more